తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Ear (Stick) । తేలికైన ఇయర్‌బడ్‌లు.. నథింగ్ ఇయర్ స్టిక్ ఇండియాలో లాంచ్!

Nothing Ear (Stick) । తేలికైన ఇయర్‌బడ్‌లు.. నథింగ్ ఇయర్ స్టిక్ ఇండియాలో లాంచ్!

HT Telugu Desk HT Telugu

27 October 2022, 14:12 IST

    • నథింగ్ ఫోన్ 1 కంపెనీ భారత మార్కెట్లో Nothing Ear (Stick) అనే సరికొత్త ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు చూడండి.
Nothing Ear (Stick)
Nothing Ear (Stick)

Nothing Ear (Stick)

స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ఎలక్ట్రానిక్స్ సంస్థ నథింగ్, తాజాగా భారత మార్కెట్లో Nothing Ear (Stick) అనే సరికొత్త ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది. ఇది నథింగ్ ఫోన్ (1) తర్వాత కంపెనీ నుంచి లాంచ్ అయిన మూడవ ప్రొడక్ట్. ఈ ఇయర్‌బడ్‌లు ఆహ్లాదకరమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి మెరుగైన సౌండ్ క్వాలిటీతో పాటు గరిష్టంగా 29 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

నథింగ్ ఇయర్ (స్టిక్) లోని ఇయర్‌బడ్‌ ఒక్కొక్కటి కేవలం 4.4గ్రా బరువు ఉంటుంది. అంటే ఇవి ధరించటానికి చాలా తేలికైనవి అని కంపెనీ వీటి బరువు గురించి ఎక్కువగా నొక్కి చెబుతుంది. అయితే, ఈ నథింగ్ ఇయర్ (స్టిక్) ఇంతకు ముందు విడుదలైన ఇయర్ (1) వంటి సిలికాన్ టిప్ లను కలిగి లేదు. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ పూర్తిగా బ్లాక్ అవ్వదు అనేది గమనించాలి.

ఈ ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉండవు కానీ బేస్ లాక్ టెక్నాలజీతో పనిచేస్తాయి. చెవులకు ధరించినపుడు మఎరుగైన బేస్ సౌండ్ పొందవచ్చు.

Nothing Ear (Stick) ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

నథింగ్ ఇయర్ (స్టిక్) లో 12.6mm డ్రైవర్లు ఉంటాయి. మూడు హై-డెఫినిషన్ మైక్‌లను అందిస్తున్నారు, ఇవి తీవ్రమైన బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను ఫిల్టర్ చేస్తాయి. అంతేకాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడేటపుడు స్పష్టమైన వాయిస్‌ని అందించేలా విండ్ ప్రూఫ్, క్రౌడ్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. వేళ్లు తడిగా ఉన్నప్పుడు కూడా ఇయర్‌బడ్‌లపై ఉండే కంట్రోల్ కీలు పనిచేస్తాయి. యూజర్ మ్యూజిక్ ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి, ట్రాక్‌లను మార్చడానికి, వాయిస్ సహాయాన్ని సక్రియం చేయడానికి, వాల్యూమ్‌ని మార్చడానికి ఇయర్‌బడ్ స్టెమ్‌పై నొక్కవచ్చు.

Nothing Ear (Stick) ధర, లభ్యత

భారతదేశంలో Nothing Ear (Stick) ధర రూ. 8,499 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఇయర్‌బడ్‌లు నవంబర్ 17,2022 నుండి Myntra అలాగే Flipkart ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఇయర్‌బడ్‌లు ఇండియాతో పాటుగా UK, US సహా ఇతర 40 దేశాలలో అందుబాటులోకి రానున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం