Infinix Note 12 (2023)। ఈ ఫోన్‌ ధర మామూలుగా ఉంది, కానీ ఫీచర్లు మామూలుగా లేవు!-infinix note 12 2023 smartphone launched with premium range features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Note 12 (2023)। ఈ ఫోన్‌ ధర మామూలుగా ఉంది, కానీ ఫీచర్లు మామూలుగా లేవు!

Infinix Note 12 (2023)। ఈ ఫోన్‌ ధర మామూలుగా ఉంది, కానీ ఫీచర్లు మామూలుగా లేవు!

HT Telugu Desk HT Telugu
Oct 17, 2022 03:14 PM IST

ఇన్ఫినిక్స్ నుంచి Infinix Note 12 (2023) అనే స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ధర మామూలుగా ఉన్నా ఫీచర్లు బలంగా ఉన్నాయి, అలాగే బడ్జెట్ ధరలో ఈరోజు Moto E22s కూడా విడుదలైంది.

Infinix Note 12 (2023)
Infinix Note 12 (2023)

హాంగ్ కాంగ్‌కు చెందిన మొబైల్ బ్రాండ్ ఇన్ఫినిక్స్, ఈ ఏడాదిలో నోట్ 12 సిరీస్‌లో వివిధ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇప్పుడు Infinix Note 12 (2023) పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ కానీ, ఇందులో ప్రీమియం రేంజ్ ఫీచర్లను అందించారు. ఇందులో భాగంగా AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాలు, పెద్ద బ్యాటరీ వంటివి ఉన్నాయి.

ఈ కొత్త ఫోన్ దాదాపు దాని పాత వెర్షన్ అయిన Infinix Note 12ని పోలి ఉంది. రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం ప్రాసెసర్ మాత్రమే. పాత మోడల్‌లో Helio G88 ప్రాసెసర్‌ ఇవ్వగా, Infinix Note 12 (2023) మీడియాటెక్ హీలియో G99 SoCని కలిగి ఉంది. ఇది విస్తరించుకోగలిగే 8GB LPDDR4X RAM అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. RAMని అదనంగా 5GB వరకు పొడిగించుకోవచ్చు. అలాగే ప్రత్యేక మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ఆ వివరాలను ఇక్కడ కింద పేర్కొన్నాం.

Infinix Note 12 (2023) స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
  • 8 GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP+ 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33 W ఛార్జర్
  • DTS టెక్నాలజీతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు

కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS, USB-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ ఆల్పైన్ వైట్, టుస్కానీ బ్లూ, వోల్కానిక్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. గ్లోబల్ మార్కెట్లో Infinix Note 12 (2023) ధర $199 (సుమారు రూ. 16,400) గా ఉంది. నేరుగా భారత మార్కెట్లో ఈ నోట్ 12 (2023) కోసం లాంచ్ తేదీని కంపెనీ అందించలేదు.

ఇది కాకుండా ఈరోజు భారత మార్కెట్లో Moto E22s అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇది Flipkartలో అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం