Ace Pro Genshin Impact Edition। వన్‌ప్లస్ నుంచి పరిమిత ఎడిషన్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ !-oneplus launches ace pro genshin impact limited edition smartphone check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus Launches Ace Pro Genshin Impact Limited Edition Smartphone, Check Details

Ace Pro Genshin Impact Edition। వన్‌ప్లస్ నుంచి పరిమిత ఎడిషన్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ !

HT Telugu Desk HT Telugu
Oct 26, 2022 06:11 PM IST

వన్‌ప్లస్ నుంచి ప్రసిద్ధ జెన్‌షిన్ ఇంపాక్ట్ యాక్షన్ గేమ్ థీమ్‌తో OnePlus Ace Pro Genshin Impact Limited Edition స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ విడుదలైంది.

OnePlus Ace Pro Genshin Impact Limited Edition
OnePlus Ace Pro Genshin Impact Limited Edition

స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ ఈ ఏడాది ఆగష్టు నెలలో OnePlus Ace Pro పేరుతో ఒక ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇదే స్మార్ట్‌ఫోన్ OnePlus 10T పేరుతో భారత మార్కెట్లోనూ విడుదలైంది. అయితే వన్‌ప్లస్ కంపెనీ తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరొక కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ' జెన్‌షిన్ ఇంపాక్ట్' అనే పరిమిత ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రసిద్ధ జెన్‌షిన్ ఇంపాక్ట్ యాక్షన్ గేమ్ ప్రేరణతో ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్.

ఈ సరికొత్త OnePlus Ace Pro Genshin Impact Limited Edition స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌లో జెన్‌షిన్ గేమ్‌కు సంబంధించిన అనేక కస్టమైజ్డ్ ఫీచర్లు ఉంటాయి. ఇందులో భాగంగా ఈ ఫోన్‌లో గేమ్ యానిమేషన్‌లు, కొత్త వాల్‌పేపర్‌లు , రంగులతో కూడిన కొత్త థీమ్‌ను అందిస్తుంది. OnePlus Ace Pro కు సాధారణంగా వచ్చే బ్లాక్ లేదా గ్రీన్ బ్యాక్ ప్యానెల్‌కు బదులుగా, జెన్‌షిన్-నేపథ్య అక్షరాలు కలిగిన కొత్త బ్యాక్ ప్యానెల్‌తో దీని డిజైన్ ఉంటుంది. అలాగే డార్క్ బ్రౌన్ కలర్‌లో లభిస్తుంది.

OnePlus Ace Pro స్మార్ట్‌ఫోన్ Genshin Impact Limited Edition వేరియంట్‌ ఏకైక 16GB+512GB కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌లో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ ప్రామాణిక వేరియంట్‌లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఈ ఫోన్ ఫీచర్ల జాబితాను మరోసారి పరిశీలించండి.

OnePlus Ace Pro Genshin Impact Edition స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 16GB RAM, 512GB స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP (Sony IMX766)+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
  • ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • Dolby Atmos సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు
  • ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4800mAh బ్యాటరీ, 150W SUPERVOOC ఛార్జింగ్

ఈ పరిమిత ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర 4299 యువాన్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా రూ. 48,665/- OPPO స్టోర్‌లలో కూడా ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం