OnePlus Ace Pro।వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. OnePlus 10Tకి రీబ్రాండ్ వెర్షనే-oneplus ace pro smartphone launched as a rebranded version of oneplus 10t ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oneplus Ace Pro।వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. Oneplus 10tకి రీబ్రాండ్ వెర్షనే

OnePlus Ace Pro।వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. OnePlus 10Tకి రీబ్రాండ్ వెర్షనే

HT Telugu Desk HT Telugu
Aug 10, 2022 08:10 PM IST

వన్‌ప్లస్ తాజాగా OnePlus Ace Pro అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఇటీవలే విడుదలైన OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్. అయితే ఈ కొత్త ఫోన్ మరింత మెరుగైన స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో విడుదలైంది.

<p>OnePlus Ace Pro</p>
OnePlus Ace Pro

మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ తమ బ్రాండ్ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ -- OnePlus Ace Proని చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల చేసిన OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్. అందువల్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు దాదాపు అలాగే ఉంటాయి. Ace Pro స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ గా చెప్పే క్వాల్కామ్ Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ఇచ్చారు. దీనిని 12GB వరకు LPDDR5 RAMతో జత చేశారు. ఈ చిప్‌సెట్‌ అధునాతనమైన 3డి కూలింగ్ సిస్టమ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో కూడా వస్తుంది.

OnePlus Ace Pro మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 3,499 (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41,200) కాగా, 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ. 44,750) అలాగే 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,299 (సుమారు రూ. 50,600)

ఈ ఫోన్ మూన్ స్టోన్ బ్లాక్ అలాగే జేడ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇంకా OnePlus Ace Proలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

OnePlus Ace Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 12GB/16GB RAM, 256/512GB స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP (Sony IMX766)+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4800mAh బ్యాటరీ, 150W SUPERVOOC ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్- Dolby Atmos సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లను కూడా కలిగి ఉంది వస్తుంది. ఆగస్టు 15 నుంచి OnePlus Ace Pro విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Whats_app_banner