Nothing Phone 1 offer: నథింగ్ ఫోన్‍ 1పై భారీ ఆఫర్.. తొలిసారి ఈ ధరకు..-nothing phone 1 gets huge offers in flipkart big saving days know offer deal details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Nothing Phone 1 Gets Huge Offers In Flipkart Big Saving Days Know Offer Deal Details

Nothing Phone 1 offer: నథింగ్ ఫోన్‍ 1పై భారీ ఆఫర్.. తొలిసారి ఈ ధరకు..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2023 09:38 PM IST

Nothing Phone 1 offer: ఫ్లిప్‍కార్ట్ బిస్ సేవింగ్ డేస్‍ (Flipkart Big Saving Days) సేల్‍లో నథింగ్ ఫోన్ 1 మంచి ఆఫర్‌కు అందుబాటులోకి వచ్చింది. తగ్గింపు ధరతో పాటు బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి.

Nothing Phone 1 offer: నథింగ్ ఫోన్‍ 1పై భారీ ఆఫర్.. తొలిసారి ఈ ధరకు..
Nothing Phone 1 offer: నథింగ్ ఫోన్‍ 1పై భారీ ఆఫర్.. తొలిసారి ఈ ధరకు.. (HT_Tech)

Nothing Phone 1 offer: ఎంతో పాపులర్ అయిన నథింగ్ ఫోన్ 1 ఆఫర్‌తో అందుబాటులో ఉంది. నేడు (జనవరి 15) మొదలైన ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍ (Flipkart Big Saving Days) సేల్‍లో ఈ మొబైల్ మంచి డిస్కౌంట్‍కు లభిస్తోంది. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ కార్డు ఆఫర్ కూడా ఉంది. విభిన్నమైన ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ డిజైన్‍తో వచ్చిన నథింగ్ ఫోన్ 1 లుక్ పరంగా ఎంతో డిఫరెంట్‍గా ఉంటుంది. గ్లిఫ్ ఇంటర్ఫేస్‍తో కూడిన ఎల్ఈడీ లైట్స్ ఈ 5జీ ఫోన్ వెనుక ఉండడం మరో ప్రత్యేకతగా ఉంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో నథింగ్ ఫోన్ 1 తగ్గింపు ధరతో లభిస్తోంది. వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

నథింగ్ ఫోన్ 1పై ఆఫర్

Nothing Phone 1 Offer: నథింగ్ ఫోన్ 1 బేస్ వేరియంట్ (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‍లో రూ.25,999 ధరతో లభిస్తోంది. సాధారణ ధరతో పోలిస్తే సుమారు 25 శాతం డిస్కౌంట్‍తో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, సిటీ, క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ ఐసీఐసీఐ, సిటీ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్‍తో నథింగ్ ఫోన్‍ 1ను కొంటే అదనంగా రూ.2,000 డిస్కౌంట్ దక్కుతుంది. అంటే ఈ బ్యాంక్ కార్డు ఆఫర్ వినియోగించుకుంటే రూ.23,999కే ఈ మొబైల్‍ను సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు

Nothing Phone 1 Specifications: స్నాప్‍డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్.. నథింగ్ ఫోన్ 1లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ నథింగ్ ఓఎస్‍పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13కు అప్‍గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్‍లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్‍తో పాటు రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

6.55 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ OLED డిస్‍ప్లేతో నథింగ్ ఫోన్ 1 వస్తోంది. హెచ్‍‍డీఆర్ 10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ మొబైల్ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్ఈటీ, వైఫై, బ్లూటూత్, ఎన్‍‍ఎఫ్‍సీ, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లను ఈ నథింగ్ మొబైల్ కలిగి ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు నథింగ్ ఫోన్ 1కు ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్