తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Ear 2: నథింగ్ ఇయర్ 2 త్వరలో వచ్చేస్తుంది! ఎస్‍ఐజీ లిస్టింగ్‍లో..

Nothing Ear 2: నథింగ్ ఇయర్ 2 త్వరలో వచ్చేస్తుంది! ఎస్‍ఐజీ లిస్టింగ్‍లో..

18 December 2022, 15:27 IST

    • Nothing Ear 2 TWS Earbuds: నథింగ్ ఇయర్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్‍లో ఇది లిస్ట్ అయింది.
Noting Ear 1
Noting Ear 1 (HT_Tech)

Noting Ear 1

Nothing Ear 2 TWS Earbuds: నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన తొలి ప్రొడక్ట్ నథింగ్ ఇయర్ 1 (Nothing Ear 1) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ మంచి క్రేజ్ సంపాదించాయి. డిమాండ్ పెరగడటంతో లాంచ్ ధర కన్నా ప్రస్తుతం ఎక్కువ ధరకు ఉన్నాయి. ట్రాన్స్‌ప్రంట్ డిజైన్, డిఫరెంట్ లుక్‍, మంచి ఫీచర్లతో ఇయర్ 1 ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీనికి సక్సెసర్‌ను తీసుకొచ్చేందుకు కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్ కంపెనీ రెడీ అయింది. నథింగ్ ఇయర్ 2 (Nothing Ear 2) కోసం ప్లాన్ చేసింది. బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG) డేటా బేస్‍లో నథింగ్ ఇయర్ 2 లిస్ట్ అయినట్టు సమాచారం వెల్లడైంది. దీంతో ఈ నయా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే నథింగ్ ఇయర్ స్టిక్ టీడబ్ల్యూఎస్‍ ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. ఇక నథింగ్ నుంచి తర్వాతి ప్రొడక్టుగా ఈ ఇయర్ 2 బడ్స్ ఉండనున్నాయి. వివరాలివే..

Nothing Ear 2 TWS Earbuds: నథింగ్ వీ155 మోడల్ నంబర్‌తో ఎస్ఐజీ లిస్టింగ్‍లో ఇది లిస్ట్ అయిందని 91మొబైల్స్ రిపోర్ట్ చేసింది. ఇది నథింగ్ ఇయర్ 2 ఇయర్ బడ్స్ మోడల్ అని తెలుస్తోంది. ఈ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్లు బయటికి రాలేదు. అయితే బ్లూటూత్ 5.2 వెర్షన్ కనెక్టివిటీతో నథింగ్ ఇయర్ 2 వస్తుందని తెలుస్తోంది. ఇక నథింగ్ ఇయర్ 2 కూడా ట్రాన్స్ ప్రంట్ చార్జింగ్ కేస్‍తోనే వస్తుందని లీకైన ఫొటోలను బట్టి తెలుస్తోంది. నథింగ్ ఇయర్ 2 గురించి ఆ సంస్థ త్వరలోనే హింట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Nothing Sub Brand ‘Particles by XO’: మరోవైపు, పార్టికల్స్ బై ఎక్స్ఓ పేరిట నథింగ్ ఓ సబ్‍బ్రాండ్‍ను లాంచ్ చేస్తుందని కూడా సమాచారం. ఈ కంపెనీ నుంచి కూడా తొలి ప్రొడక్టుగా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ వస్తాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2023 తొలి అర్ధభాగంలోనే ఈ సబ్ బ్రాండ్‍ను నథింగ్ లాంచ్ చేస్తుందని, దీని పేరు Particles by XOగా ఉంటుందని ప్రముఖ టిప్ స్టర్ కుబా వొజ్‍సిచోస్కి వెల్లడించారు.

ఇటీవల నథింగ్ ఇయర్ స్టిక్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. లిప్ స్టిక్ లాంటి ట్విస్ట్ టు ఓపెన్ కేస్ డిజైన్, డిఫరెంట్ లుక్‍తో ఈ బడ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ బడ్స్ ఫుల్ చార్జ్‌పై 7 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‍తో మరో మూడుసార్లు చార్జ్ చేసుకోవచ్చు. అంటే మొత్తంగా 29 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఈ నథింగ్ స్టిక్స్ ధర రూ.7,299గా ఉంది. అయితే దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) ఫీచర్ లేదు. ఇక నథింగ్ ఇయర్ 1.. ఏఎన్‍సీని కూడా కలిగి ఉంది. ఇక తదుపరి వచ్చే నథింగ్ ఇయర్ 2 కూడా ఈ ఫీచర్‌తో వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం