తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia G60 5g । నోకియా నుంచి మిడ్-రేంజ్ ఫోన్.. శాంసంగ్ ఫోన్‌కు దగ్గరి పోలికలు!

Nokia G60 5G । నోకియా నుంచి మిడ్-రేంజ్ ఫోన్.. శాంసంగ్ ఫోన్‌కు దగ్గరి పోలికలు!

HT Telugu Desk HT Telugu

01 November 2022, 19:28 IST

google News
    • నోకియా నుంచి Nokia G60 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా Nokia Power Earbuds Lite ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే, వివరాలు చూడండి.
Nokia G60 5G
Nokia G60 5G

Nokia G60 5G

నోకియా బ్రాండ్ లైసెన్సీ కలిగి ఉన్న HDM గ్లోబల్, తాజాగా భారత మార్కెట్లో నోకియా G60 5G అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ మెరుగైన రిఫ్రెర్ష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మొదలైన ప్రీమియం ఫీచర్లతో వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. అయితే కంపెనీ మూడేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించనున్నట్లు పేర్కొంది.

Nokia G60 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM /128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఏకైక కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునే వీలుంది. ఈ ఫోన్ బ్లాక్, ఐస్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. Nokia G60 5G ఇప్పటికే అధికారిక నోకియా వెబ్‌సైట్, ఇంకా ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. నేటి నుండి నవంబర్ 7 వరకు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు, నవంబర్ 8 నుండి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్ల కోసం కంపెనీ రూ. 3,599 విలువ గల Nokia Power Earbuds Lite సెట్‌ను ఉచితంగాఅందిస్తోంది.

మరి ఈ కొత్త Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలు ఈ కింద చూడండి.

Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల FHD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 120 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + 5MP +2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జర్

ఇతర కనెక్టివిటీ ఫీచర్లలో బ్లూటూత్ 5.1, 3.5 మిమీ జాక్, టైప్-సి పోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఉన్నాయి.

Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 29,999/- గా ఉంది. అయితే ఇదే తరహా ఫీచర్లతో మార్కెట్లో Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. దాని ధర ఈ నోకియా కంటే కొద్దిగా తక్కువగానే ఉంది. ఆ ఫోన్ ఎలా ఉందో క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

తదుపరి వ్యాసం