Nokia G42 : నోకియా నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. జీ42 5జీ ధర ఎంతంటే!
11 September 2023, 18:30 IST
- Nokia G42 : నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధర రూ. 12,599. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే…
నోకియా జీ42 5జీ ధర ఎంతంటే!
Nokia G42 launch in India : మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌తో ఇండియా మార్కెట్లోకి వచ్చేసింది హెచ్ఎండీఏ గ్లోబల్ సంస్థ. తాజాగా.. నోకియా జీ42ని లాంచ్ చేసింది. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే..
నోకియా జీ42 5జీలో ఐపీ52 రేటెడ్, వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్ ఉంటుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ దీని సొంతం. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.56 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇందులో ఉంటుంది. ఈ మోడల్‌కు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తోంది.
ఈ మొబైల్ రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్ కెమెరా వస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ నోకియా జీ42 5జీలో స్నాప్‌డ్రాగన్ 480+ చిప్సెట్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
Nokia G42 5G price in India : ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఇది 3 రోజుల పాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. ఈ మోడల్‌కు 20వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Oppo A38 : ఒప్పో ఏ38 లాంచ్.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంది?
నోకియా జీ42 5జీ ధర ఎంతంటే..
నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్ప్యాండెబల్ స్టోరేజ్ కూడా వస్తోంది. పర్పుల్, గ్రే రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ నెల 15 నుంచి అమెజాన్‌లో ఈ నోకియా జీ42 5జీ సేల్ మొదలవుతుంది. ఈ మోడల్ ధర రూ .12,599గా ఉంది. 2 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్‌తో పాటు 3ఏళ్ల సెక్యురిటీ అప్డేట్స్ ఇస్తామని సంస్థ చెబుతోంది.
లావా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్..
Lava Blaze 2 pro price : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ అడుగుపెట్టింది. అదే లావా బ్లేజ్ 2 ప్రో. ఈ కొత్త మొబైల్లో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ (720x1600 పిక్సెల్స్) డిస్ప్లే వస్తోంది. ఈ గ్యాడ్జెట్ బరువు 190గ్రాములు. డైమెన్షన్స్.. 163ఎంఎంx75.2ఎంఎంx8.5ఎంఎం. ఈ మోడల్ పూర్తి ఫీచర్స్, ధర వంటి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.