Nissan Magnite Kuro : ఇదిగో నిస్సాన్ మాగ్నైట్ కురో.. ధర ఎంతంటే!
08 October 2023, 12:40 IST
- Nissan Magnite Kuro : నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ అట్రాక్టివ్‌గా ఉంది. ఈ ఎస్యూవీ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూద్దాము..
ఇదిగో నిస్సాన్ మాగ్నైట్ కురో.. ధర ఎంతంటే!
Nissan Magnite Kuro : ఇండియాలో నిస్సాన్ సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది మాగ్నైట్ ఎస్యూవీ. ఇక మార్కెట్లోకి మాగ్నైట్ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది నిస్సాన్ సంస్థ. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నిస్సాన్ మాగ్నైట్ కురో విశేషాలివే..
ఈ మాగ్నైట్ కురో ఎడిషన్‌లోని ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో ఆల్-బ్లాక్ డిజైన్ ఉంటుంది. బ్లాక్డ్ ఔట్ గ్రిల్, ఫ్రెంట్- రేర్ బంపర్స్, డోర్ హ్యాండిల్స్, రూఫ్ రెయిల్స్, స్కిడ్ ప్లేట్స్, హెడ్‌లైట్ యాక్సెంట్స్ వంటివి ఎక్స్టీరియర్లో వస్తున్నాయి. గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ సైతం లభిస్తున్నాయి.
Nissan Magnite Kuro edition price : ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ నిస్సాన్ వెహికిల్‌లో ఆల్- బ్లాక్ థీమ్ కేబిన్, సన్ విజర్స్, ఫ్లోర్ మ్యాట్స్, స్టీరింగ్ వీల్ కవర్, బ్లాక్డ్ ఔట్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సరండర్స్తో కూడిన ఏసీ వెంట్స్ వస్తున్నాయి. 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ కూడా ఉన్నాయి. డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వయర్లెస్ ఛార్జర్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఈ నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ఎస్‌యూవీలో 1.0 లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 71 హెచ్‌పీ పవర్‌ను, 96 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సైతం ఉంటుంది. ఇది 99 హెచ్‌పీ పవర్‌ను, 152 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి.
ఈ ఎస్యూవీ ధర ఎంతంటే..
Nissan Magnite Kuro price Hyderabad : ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.27లక్షలు- రూ. 10.46లక్షల మధ్యలో ఉంటుంది. బుకింగ్స్ మొదలయ్యాయి. సంస్థకు చెందిన డీలర్షిప్షోరూమ్స్లో ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.
"స్టైల్, వాల్యూ, సేఫ్టీ కలగలిపిన మోడల్.. ఈ నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు కార్లను డెలివరీ చేయాలన్న మా ఆలోచనకు నిదర్శనమే ఈ కొత్త ఎడిషన్," అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు.
Nissan India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. నిస్సాన్ కూడా కొన్ని మోడల్స్‌ను ఇండియాలోకి తీసుకొస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.