Hyundai Exter vs Nissan Magnite : హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- ఏది బెస్ట్?
21 July 2023, 7:16 IST
- Hyundai Exter vs Nissan Magnite : హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్.. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
హ్యందాయ్ ఎక్స్టర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- ఏది బెస్ట్?
Hyundai Exter vs Nissan Magnite : ఇండియా ఎస్యూవీ సెగ్మెంట్లో లేటెస్ట్ ఎంట్రీ హ్యుందాయ్ ఎక్స్టర్కు కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నిస్సాన్ మాగ్నైట్‌కు ఈ కొత్త మోడల్ గట్టిపోటీనిస్తుంది అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల డిజైన్ ఎలా ఉంటుంది..
ఎక్స్టర్ ఎస్‌యూవీలో హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, గ్లాస్ బ్లాక్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, బంపర్స్పై సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఓవరాల్‌గా ఇందులో పారామెట్రిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఈ మోడల్ పొడవు 3,815ఎంఎం. వెడల్పు 1,710ఎంఎం. ఎత్తు 1,631ఎంఎం. వీల్‌బేస్ 2,450ఎంఎం (Hyundai Exter price).
నిస్సాన్ ఎస్‌యూవీలో క్రోమ్ సరౌండింగ్‌తో కూడిన గ్రిల్, ఫ్రెంట్ బంపర్‌పై స్కిడ్ ప్లేట్, స్వెప్ట్ బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బంపర్ మౌంటెడ్ ఎల్ షేప్ డీఆర్ఎల్స్, బ్లాక్డ్ ఔట్ పిల్లర్స్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎం, 16 ఇంచ్ డిజైనర్ అలాయ్ వీల్స్ వంటివి వస్తున్నాయి.
ఈ మోడల్ (Nissan Magnite price) పొడవు 3,994ఎంఎం. వెడల్పు 1,758ఎంఎం. ఎత్తు 1,572ఎంఎం. వీల్‌బేస్ 2,500ఎంఎం.
ఇదీ చూడండి:- Exter vs Fronx : హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్.. ఏది బెస్ట్?
ఈ రెండు వాహనాల ఫీచర్స్ ఇవే..
హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ 5 సీటర్ కేబిన్‌లో ఫేబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ కెమెరాతో కూడిన డాష్‌క్యామ్, వాయిస్ ఎనేబుల్డ్ సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్ (Hyundai Exter features), ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ ఇన్పోటైన్మెంట్ ప్యానెల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వస్తున్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ 5 సీటర్ కేబిన్‌లో కీ-లెస్ ఎంట్రీ, స్టార్ట్ ఫంక్షన్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, బైగ్ కలర్ అప్‌హోలిస్ట్రీ, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, జేబీఎల్ సోర్స్డ్ స్పీకర్స్, ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.
ఈ వెహికిల్స్ ఇంజిన్ ఆప్షన్స్ వివరాలు..
హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీలో 1 .2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 88 హెచ్‌పీ పవర్‌ను, 113.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక సీఎన్జీ ఇంజిన్ 67 హెచ్‌పీ పవర్‌ను, 95ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాగ్స్, 5 స్పీడ్ ఏఎంటీ యూనిట్ వస్తోంది.
నిస్సాన్ కారులో (Nissan Magnite on road price) 1.0 నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 71 హెచ్‌పీ పవర్నుప, 96 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా లభిస్తోంది. 5 స్పీడ్ మేన్యువల్తో పాటు సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ వస్తోంది.
వీటి ధరలెంత..?
హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter on road price Hyderabad) ఎక్స్‌షోరూం ధర రూ. 5.9లక్షల నుంచి రూ. 10లక్షల మధ్యలో ఉంటుంది. ఇక నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షల నుంచి రూ. 11.02లక్షల వరకు ఉంటుంది.