తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Dzire : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. సూపర్​ ఫీచర్స్​తో!

Maruti Suzuki Dzire : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. సూపర్​ ఫీచర్స్​తో!

Sharath Chitturi HT Telugu

05 November 2023, 12:45 IST

google News
    • Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీ డిజైర్​ నెక్ట్స్​ జెనరేషన్​ మోడల్​ సిద్ధమవుతోంది. కొత్త ఫీచర్స్​తో ఈ మోడల్​ రాబోతోందట! ఆ వివరాలు..
సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. సూపర్​ ఫీచర్స్​తో!
సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. సూపర్​ ఫీచర్స్​తో!

సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. సూపర్​ ఫీచర్స్​తో!

Maruti Suzuki Dzire : నెక్ట్స్​ జెనరేషన్​ మారుతీ సుజుకీ డిజైర్​ని సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ మోడల్​.. 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఈ కారు సరికొత్తగా ఉండనుందని, అనేక కొత్త ఫీచర్స్​ ఇందులో కనిపిస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ డిజైర్​..

పలు నివేదికల ప్రకారం.. 2024 మారుతీ సుజుకీ డిజైర్​ 9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​ ఉండనుంది. వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో, బిల్ట్​-ఇన్​ నేవిగేషన్​తో పాటు ఇతర కూల్​ ఫీచర్స్​ ఇందులో ఉంటాయి. వెహికిల్​ ఇన్ఫర్మేషన్​, డాష్​ బోర్డ్​ కమెరా కంపాటబులిటీ వంటివి ఉండొచ్చు. ప్రీ-ఇన్​స్టాల్డ్​ వెథర్​, న్యూస్​, మ్యూజిక్​ యాప్స్​ వంటివి ఇందులో ఉండనున్నాయి.

2024 Maruti Suzuki Dzire : ఇక ఈ కొత్త మారుతీ సుజుకీ డిజైర్​ ఇంటీరియర్​ విషయానికొస్తే.. డాష్​బోర్డ్​ చాలా కొత్తగా ఉంటుందట. ఫౌక్స్​ వుడ్​ ఫినిషింగ్​ లభిస్తుందని సమచారం. క్లైమేట్​ కంట్రోల్​ సిస్టెమ్​ని టాగిల్​ స్విఛెస్​తో అప్డేట్​ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇందుకోసం డెడికేటెడ్​ డిస్​ప్లేలు ఉంటాయట. మారుతీ సుజుకీ బలేనో, బ్రెజాలో ఇవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి:- Big discounts on Mahindra SUVs: మహింద్ర ఎస్ యూ వీలపై భారీ డిస్కౌంట్స్; 3.5 లక్షల వరకు..

ఇక నెక్ట్స్​ జెనరేషన్​ డిజైర్​లో 1.2 లీటర్​, 3 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. ఇది 100 హెచ్​పీ పవర్​ని, 150 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. సీవీటీ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్​ కూడా లభించొచ్చు.

Maruti Suzuki Dzire on road price Hyderabad : ఇక సేఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ మోడల్​లో ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​, అడాప్టివ్​ క్రూజ్​ కంట్రోల్​, బ్లైండ్​ స్పాడ్​ మానిటర్​, రేర్​ క్రాస్​ ట్రాఫిక్​ అలర్ట్​, 360 డిగ్రీ వ్యూ కెమెరా, లేన్​ కీప్​ అసిస్ట్​, హై బీమ్​ అసిస్ట్​ వంటి ఫీచర్స్​ ఉండనున్నాయి.

ఈ మోడల్​ ఇతర ఫీచర్స్​పై ప్రస్తుతం క్లారిటీ లేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లాంచ్​ డేట్​ని కూడా సంస్థ అప్డేట్​ చేయాల్సి ఉంది.

Maruti Suzuki Dzire price Hyderabad : అయితే.. నెక్ట్స్​ జెనరేషన్​ స్విఫ్ట్​ని కూడా మారుతీ సుజుకీ సంస్థ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. స్విఫ్ట్​- డిజైర్​ ఫీచర్స్​ ఒకే విధంగా ఉండొచ్చని, ఈ రెండూ కూడా.. కొన్ని వారాల వ్యవధిలోనే లాంచ్​ అవ్వొచ్చని టాక్​ నడుస్తోంది.

తదుపరి వ్యాసం