తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki: అక్టోబర్ లోనూ కొనసాగిన మారుతి సుజుకీ కార్ల హవా

Maruti Suzuki: అక్టోబర్ లోనూ కొనసాగిన మారుతి సుజుకీ కార్ల హవా

HT Telugu Desk HT Telugu

01 November 2023, 16:32 IST

  • Maruti Suzuki sales: ప్రముఖ కార్ తయారీ సంస్థ మారుతి సుజుకీ మరోసారి తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. అక్టోబర్ నెలలో అత్యధిక సంఖ్యలో కార్లను అమ్మి రికార్డు సృష్టించింది.

మారుతి సుజుకీ కార్ల లైనప్
మారుతి సుజుకీ కార్ల లైనప్

మారుతి సుజుకీ కార్ల లైనప్

Maruti Suzuki sales: దేశీయంగా అక్టోబర్ నెలలో మొత్తం 1,77, 266 వాహనాలను అమ్మామని మారుతి సుజుకీ ప్రకటించింది. గత సంవత్సరం అక్టోబర్ లో జరిపిన అమ్మకాల కన్నా ఇది 21% అధికమని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

ఎస్ యూ వీ మార్కెట్

భారతీయ వాహన వినియోగదారుల్లో ఇప్పుడు ఎస్ యూ వీలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. అన్ని కంపెనీల వాహనాల అమ్మకాల్లో కూడా ఎస్ యూవీ ల వాటానే అధికంగా ఉంది. మారుతి సుజుకీలో కూడా సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ కేటగిరీలో బ్రెజా (Brezza), మిడ్ సైజ్ ఎస్ యూవీ కేటగిరీలో గ్రాండ్ విటారా (Grand Vitara) ఈ అక్టోబర్ నెల అమ్మకాల్లో దుమ్ము దులిపాయి. లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఫ్రాంక్స్, జిమ్ని కూడా మంచి సేల్స్ సాధించాయి. మొత్తంగా యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో మారుతి సుజుకీ మొత్తం 59,147 వాహనాలను అమ్మగలిగింది. గత సంవత్సరం అక్టోబర్ లో ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకీ అమ్మగలిగిన వాహనాల సంఖ్య 30,971. కాంపాక్ట్ సెగ్మెంట్లోని స్విఫ్ట్, డిజైర్, బేలనో, సెలీరియో, ఇగ్నిస్, వేగన్ ఆర్ కార్లు ఈ అక్టోబర్ నెలలో 80,662 యూనిట్లు అమ్ముడుపోయాయి.

అమ్మకాల్లో రికార్డు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ - అక్టోబర్) మారుతి సుజుకీ మొత్తం 10,41,154 ప్యాసెంజర్ వెహికిల్స్ ను అమ్మగలిగింది. గత సంవత్సరం ఇదే పీరియడ్ లో మారుతి సుజుకీ అమ్మగలిగిన వాహనాల సంఖ్య 9,34,887. కాగా, మారుతి సుజుకీ లైనప్ లోని చిన్న వాహనాలైన ఆల్టో, ఎస్ ప్రెస్సోల అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గాయి. ఈ రెండు మోడల్స్ కలిపి ఈ అక్టోబర్ నెలలో మొత్తం 14,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం అక్టోబర్ లో ఇవి మొత్తం 24,936 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. మరో 2, 3 సంవత్సరాల పాటు కూడా చిన్న వాహనాల అమ్మకాలు తగ్గుతూనే ఉంటాయని భావిస్తున్నామని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్ సీ భార్గవ తెలిపారు.

తదుపరి వ్యాసం