Kawasaki Eliminator 450 : సరికొత్త కవాసాకి ఎలిమినేటర్ 450 ఇదిగో..!
02 December 2023, 13:31 IST
- Kawasaki Eliminator 450 : కవాసాకి నుంచి కొత్త బైక్ లాంచ్‌కు సిద్ధమవుతంది. ఈ కవాసాకి ఎలిమినేటర్ 450 టీజర్‌ని సంస్థ రివీల్ చేసింది.
సరికొత్త కవాసాకి ఎలిమినేటర్ 450 ఇదిగో..!
Kawasaki Eliminator 450 : కవాసాకి ఎలిమినేటర్ 450 టీజర్‌ని డ్రాప్ చేసింది ఇండియా కవాసాకి మోటార్. త్వరలో జరగనున్న 2023 ఇండియా బైక్ వీక్‌లో ఈ మోడల్ని లాంచ్ చేయనుంది సంస్థ. ఈ ఏడాదిలో.. కవాసాకి ఎలిమినేటర్ 450ని అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది సంస్థ. ఈ నేపథ్యంలో ఇండియలోకి వచ్చే ఈ బైక్ ఫీచర్స్‌కు సంబంధించిన విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
కవాసాకి ఎలిమినేటర్ 450..
ఎలిమినేటర్ పేరు భారతీయులకు సుపరిచితమే. 1985లో 900 సీసీ ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్‌తో ఓ బైక్‌ని విడుదల చేసింది. 1000 సీసీ లిమిటెడ్ ఎడిషన్ కూడా ఇండియాలో అడుగుపెట్టింది. ఆ తర్వాత.. 750 సీసీ, 600 సీసీ, 400 సీసీ, 250 సీసీ ,175 సీసీ, 125 సీసీ సెగ్మెంట్స్‌లో చాలా బైక్స్‌ని వదిలింది. వీటిల్లో చాలా వరకు హిట్ అయ్యాయి. ఇక కవాసాకి ఎలిమినేటర్ 175 కూడా ఇండియాలోకి వచ్చింది. దీనినే రీబ్రాండ్ చేసి బజాజ్ అవెంజర్ 180గా విక్రయించారు.
Kawasaki Eliminator 450 price : ఇక 2023 కవాసాకి ఎలిమినేటర్‌లో ఆల్ బ్లాక్ లుక్‌తో కూడిన రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, భారీ ఫ్యూయెల్ ట్యాంక్, లో- సిట్ స్ల్పిట్ సీట్స్ వంటివి ఉన్నాయి. ఇంజిన్ కేసింగ్, ఛాసిస్, అలాయ్ వీల్స్‌కి బ్లాక్డ్ ఔట్ ఫినిషింగ్ లభిస్తోంది.
కవాసాకి ఎలిమినేటర్ 450లో 451 సీసీ, పారలెల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 44.7 హెచ్‌పీ పవర్‌ని 42.6 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఫ్రెంట్లో 18 ఇంచ్ (41ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్) ఫ్రెంట్ వీల్, 16 ఇంచ్ (ట్విన్ షాక్ అబ్సార్బర్స్) రేర్‌లో వస్తున్నాయి. ఈ బైక్‌లో డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. ఈ బైక్ కర్బ్ వెయిట్ 176 కేజీలు.
Kawasaki Eliminator 450 price in India : ఈ మోడల్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా.. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 5.5లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.