Kawasaki Ninja: కవాసాకి నింజా.. 40వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్.. ప్రత్యేకతలేంటో తెలుసా..?
27 October 2023, 17:48 IST
- Kawasaki Ninja ZX-10R: కవాసాకి నింజా .. దాదాపు 40 ఏళ్లుగా యూత్ ను ఆకట్టుకుంటున్న బైక్. ఇందులో వచ్చిన అన్ని మోడల్స్ సూపర్ హిట్టే. తాజాగా 2024 వర్షన్ కవాసాకి నింజా జడ్ ఎక్స్- 10ఆర్ (Kawasaki Ninja ZX-10R) 40వ వార్షికోత్సవ ఎడిషన్ ను ఆవిష్కరించారు.
2024 నింజా ZX-10R
కవాసాకి నింజా మోటార్‌సైకిల్ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2024 నింజా ZX-10Rని విడుదల చేసింది. 2024 కవాసాకి నింజా ZX-10R 40వ వార్షికోత్సవ ఎడిషన్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కవాసాకి నింజా మొదట 1984 లో మార్కెట్లోకి వచ్చింది. నాటి నుంచి యూత్ ను ఆకట్టుకుంటూనే ఉంది.
2024 నింజా ZX-10R
1990ల నాటి యూత్ కు ఎప్పుడు గుర్తుండిపోయే బైక్ కవాసాకి నింజా. ఇందులో నింజా జడ్ ఎక్స్ 7 ఆర్ అత్యంత ప్రజాదరణ పొందిన స్టోర్ట్స్ బైక్. ఆకుపచ్చ, తెలుపు, బ్లూ కలర్ స్కీమ్ తో ఉన్న ఆ బైక్ ప్రపంచ SBK ఛాంపియన్‌షిప్ నకు ఐకన్ గా ఉంది. ఇప్పుడు తాజాగా నింజా జడ్ ఎక్స్ -10 ఆర్ 40వ వార్షికోత్సవ ఎడిషన్ ను మరింత ఆకర్షణీయంగా, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ముస్తాబు చేశారు.
రెట్రో లుక్
నింజా బ్రాండ్ 1984లో మొదటిసారిగా ప్రారంభమైంది. ఇప్పుడు లైమ్ గ్రీన్, పెర్ల్ క్రిస్టల్ వైట్, బ్లూ కలర్స్ నాలుగు దశాబ్దాల నింజా బ్రాండ్‌ను మరోసారి కళ్లముందుకు తీసుకువస్తోంది. ఈ బైక్ వీల్స్ లైమ్ గ్రీన్, సిల్వర్ ఫినిష్ కలర్స్ కాంబినేషన్ లో ఉంటాయి. బైక్ ఫ్యుయెల్ ట్యాంక్ పై ఆంగ్లంలో 40వ వార్షికోత్సవం అనే ఎంబ్లం రెట్రోఫాంట్ లో అందంగా ముద్రించి ఉంటుంది.
ఇంజన్ వివరాలు..
2024 కవాసాకి నింజా ZX-10R 40వ వార్షికోత్సవ ఎడిషన్ ఇంజన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 998 సీసీ ఇన్-లైన్, ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 200.21 బీహెచ్ పీ, 114.9 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు క్విక్‌షిఫ్టర్ ఉంటుంది. బైక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, పవర్ మోడ్, డ్యూయల్-ఛానల్ ABS, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ లో ముందవైపు 43 ఎంఎం యూఎస్డీ బ్యాలెన్స్-ఫ్రీ ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్‌ను ఉపయోగించారు. అలాగే, డ్యూయల్ 330 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు ఒకే 220 ఎంఎం డిస్క్ బ్రేక్ లను అమర్చారు.