తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mxmoto Electric Bike : మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. జులైలో ‘ఎంఎక్స్​9’ లాంచ్​!

mXmoto electric bike : మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. జులైలో ‘ఎంఎక్స్​9’ లాంచ్​!

Sharath Chitturi HT Telugu

27 June 2023, 9:26 IST

google News
    • mXmoto electric bike : ఎంక్స్​9 ఎలక్ట్రిక్​ బైక్​ను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఎంఎక్స్​మోటో సంస్థ. జులైలో ఈ బైక్​ లాంచ్​కానుంది. పూర్తి వివరాలు..
మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. జులైలో ‘ఎంఎక్స్​9’ లాంచ్​!
మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. జులైలో ‘ఎంఎక్స్​9’ లాంచ్​!

మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. జులైలో ‘ఎంఎక్స్​9’ లాంచ్​!

mXmoto electric bike : దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేసేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా.. ఈవీలు తయారు చేసి విక్రయించి, వ్యాపారాన్ని వృద్ధిచేసుకునేందుకు కొత్త కొత్త సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎంఎక్స్​మోటో సంస్థ కూడా ఇలాంటిదే! ఈ సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్​ బైక్​.. జులైలో లాంచ్​కానుంది. దీని పేరు "ఎంఎక్స్​మోటో ఎంఎక్స్​9". ఈ ఎలక్ట్రిక్​ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంఎక్స్​9 ఎలక్ట్రిక్​ వెహికిల్​ హైలైట్స్​ ఇవే..

ఈ కొత్త ఈవీలో 17 ఇంచ్​ వీల్స్​, రీజనరేటివ్​ బ్రేకింగ్​తో కూడిన 60 ఏఎంపీ కంట్రోలర్​లు వస్తున్నాయి. ఫలితంగా బైక్​ ఔట్​పుట్​ పవర్​ 16శాతం పెరుగుతుంది. వెహికిల్​ పర్ఫార్మెన్స్​ సైతం మెరుగుపడుతుంది. ఈ బైక్​ను ప్రముఖ డిజైనర్​, క్రియేటర్​ మెకెల్లో సిల్వా.. యూరోప్​లో డిజైన్​ చేశారు.

ఈ ఎంక్స్​9 ఈవీలో లైఫ్​పీఓ4 బ్యాటరీ టెక్నాలజీ ఉంటుంది. ఇది సేఫ్టీకి పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుందని సంస్థ చెబుతోంది. ఈ టెక్నాలజీ వల్ల బ్యాటరీ రేంజ్​, రైడింగ్​ టైమ్ మెరుగుపడుతుంది. ఫలితంగా.. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్​ ట్రిప్​లకు కూడా ఈ బైక్​ను ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది.

mXmoto MX9 electric bike : ఎంఎక్స్​మోటోకు గురుగ్రామ్​లో ఓ మేన్యుఫ్యాక్చరింగ్​ ఫ్యాక్టరీ ఉంది. ఏడాదికి 3వేలు- 4వేల ఎలక్ట్రిక్​ వాహనాలను రూపొందించే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీ సొంతం. ఈ నేపథ్యంలో ఎంఎక్స్​9 తర్వాత.. బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్లను ఇండియాలో లాంచ్​ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది.

ఇదీ చూడండి:- Ola new electric scooter : ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. సీఈఓ ట్వీట్​కు అర్థం ఇదేనా?

"చౌకైన ధరల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా హై పర్ఫార్మెన్స్​ ఈవీలను రూపొందించడమే మా లక్ష్యం," అని ఎంఎక్స్​మోటో ఎండీ రాజేంద్ర మల్హోత్రా తెలిపారు.

లాంచ్​ తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ ఎక్స్​క్లూజివ్​ షోరూమ్​లు, డీలర్​షిప్​ నెట్​వర్క్​లలో ఈ ఎంఎక్స్​9 ఎలక్ట్రిక్​ బైక్​ అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

త్వరలో లాంచ్​కానున్న ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే..

Bajaj Auto electric scooter news : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థలు 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​పై ఫోకస్​ పెంచాయి. తమ ఎలక్ట్రిక్​ స్కూటర్లను ఇండియాలో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. బజాజ్​ ఆటో నుంచి స్వింగర్​, జీనీ పేర్లతో రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లు రాబోతున్నట్టు మార్కెట్​లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా పేటెంట్స్​ డిజైన్​ అండ్​ ట్రైడ్​మార్క్స్​ వెబ్​సైట్​లో స్వింగర్​, జీనీ పేర్లు మే నెలలో కనిపించాయి. వీటిని బజాజ్​ ఆటో ట్రైడ్​మార్క్​ చేసుకున్నట్టు తేలింది. వీటికి సంబంధించిన ఇతర వివరాలేవీ అందుబాటులో లేవు. కానీ ఇవి ఎలక్ట్రిక్​ స్కూటర్లని మార్కెట్​లో అంచనాలు మొదలయ్యాయి.

ఇండియా మార్కెట్​లోకి త్వరలోనే 2 కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లను లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది సింపుల్​ ఎనర్జీ సంస్థ. ఇవి.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న సింపుల్​ 1 కన్నా తక్కువ ధరలో ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం సింపుల్​ 1 ఎక్స్​షోరూం ధర రూ. 1.45లక్షలు- రూ. 1.5లక్షల మధ్యలో ఉంది.

మరిన్ని ఎలక్ట్రిక్​ వాహనాల లాంచ్​ల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం