తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Accessories : వర్షాకాలంలో.. మీ కారులో ఈ యాక్ససరీస్ కచ్చితంగా​ ఉండాల్సిందే!

Car accessories : వర్షాకాలంలో.. మీ కారులో ఈ యాక్ససరీస్ కచ్చితంగా​ ఉండాల్సిందే!

Sharath Chitturi HT Telugu

12 June 2023, 20:20 IST

google News
    • Car accessories for rainy season : వర్షాకాలం కోసం సన్నద్ధమవుతున్నారా? మీకే కాదు.. మీ కారుకు కూడా రక్షణ కావాలి కదా. అందుకే.. ఈ సీజన్​లో కచ్చితంగా ఉండాల్సిన యాక్ససరీస్​ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
వర్షాకాలంలో.. ఈ యాక్ససరీస్​ మీ కారులో ఉండాల్సిందే!
వర్షాకాలంలో.. ఈ యాక్ససరీస్​ మీ కారులో ఉండాల్సిందే! (HT AUTO)

వర్షాకాలంలో.. ఈ యాక్ససరీస్​ మీ కారులో ఉండాల్సిందే!

Car accessories for rainy season : వర్షాకాలంలో డ్రైవింగ్​ అంటే ఒకింత కష్టమైన పనే. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్​.. డ్రైవర్లకు చాలా చిరాకు వస్తుంది. ఇక నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకేశాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరగనుంది. ఈ నేపథ్యంలో మీకే కాదు.. మీ కారుకు కూడా రక్షణ అవసరమే. అందుకే.. వర్షాకాలంలో కారులో కచ్చితంగా ఉండాల్సిన యాక్ససరీస్​ను ఇక్కడ తెలుసుకుందాము..

విండో విజర్​..

వర్షాకాలంలో కారు విండోలు తీసి నడపడం చాలా కష్టం. వర్షం నీరు కారు కేబిన్​లోకి పడితే.. ఇక అంతే! అలా అని ప్రతిసారి విండో మూసి, ఏసీ ఆన్​ చేసుకుని కూర్చోవడం చాలా మందికి చిరాకును తెప్పిస్తుంది. అందుకే.. 'విండో విజర్​'ని వాడాలి. వీటినే డోర్​ విజర్స్​ అని కూడా అంటారు. ఇవి విండోలపైన ఉంటాయి. వీటితో వర్షపు చినుకులు కారు కేబిన్​ లోపలికి రాకుండా ఉంటాయి. ఫలితంగా చల్లటి వాతావరణాన్ని మీరు ఎంజాయ్​ చేయవచ్చు.

ఫాగ్​ ల్యాంప్స్​..

Car accessories Hyderabad : వర్షాకాలంలో ఫాగ్​తో డ్రైవర్లు తరచూ ఇబ్బంది పడుతుంటారు. తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే కారుకు ఫాగ్​ ల్యాంప్స్​ కచ్చితంగా ఉండాలి. ఇప్పుడొస్తున్న కార్లలో ఫాగ్​ ల్యాప్స్​ ప్రీ ఇస్టాల్డ్​గానే ఉంటున్నాయి. కానీ పాత కార్లకు ఫాగ్​ ల్యాంప్స్​ రావడం లేదు. అందువల్ల.. ఫాగ్​ ల్యాంప్స్​ను కొనుగోలు చేసి, మెకానిక్​తో ఫిట్​ చేయించుకోవడం ఈ వర్షాకాలంలో చాలా అవసరం.

ఇదీ చూడండి:- How to take care of car in rainy season : వర్షాకాలం వచ్చేస్తోంది.. మీ కారు భద్రమేనా?

వైపర్​ బ్లేడ్​..

కారులో అతి తక్కువగా వాడే పరికరాల్లో వైపర్​ బ్లేడ్​ ఒకటి. వర్షాకాలం అయిపోతే.. వాటిని ఉపయోగించం. మరి ఇప్పుడు వర్షాకాలం తిరిగొస్తోంది. అందుకే.. వైపర్​ బ్లేడ్ పనితీరును చెక్​ చేసుకోవడం మంచిది. సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా బ్లేడ్స్​ని రిప్లేస్​ చేయాలా? అని చూసుకోవాలి. వేడి వల్ల వైపర్​ బ్లేడ్స్​ రబ్బర్​పై ఎఫెక్ట్​ పడుతుంది. వేర్​ అండ్​ టేర్​కు గురైతే.. వైపర్​ బ్లేడ్స్​ను మార్చాల్సి ఉంటుంది.

కార్​ బాడీ కవర్​..

కార్​ బాడీ కవర్​ అన్నది ముఖ్యమైన యాక్ససరీస్​లో ఒకటిగా మారింది. ముఖ్యంగా వానా కాలంలో దీనిని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. క్లోజ్డ్​ ప్రాంతంలో కారును పార్క్​ చేసుకోలేకపోతే.. ఓపెన్​ ప్లేస్​లో పెడితే కారుకు కవర్​ వేయాల్సి ఉంటుంది. దీని వల్ల వర్షంతో పాటు దుమ్ము, చెట్ల నుంచి రాలే ఆకులు వంటి వాటి నుంచి కూడా కారుకు రక్షణ లభిస్తుంది.

మడ్​ఫ్లాప్​..

Rainy season car accessories : ఇప్పుడు ప్రతి కారుకు మడ్​ఫ్లాప్స్​ వస్తున్నాయి. దీనిని మౌల్డెడ్​ ప్లాస్టిక్​తో రూపొందిస్తారు. ఫ్రెంట్​ టైర్ల వెనక, రేర్​ టైర్ల ముందు భాగంలో ఈ మడ్​ఫ్లాప్​ అనేది ఉంటుంది. మట్టి నుంచి కారు మెటల్​ పార్ట్​కు రక్షణ కల్పిస్తుంది ఈ మడ్​ఫ్లాప్​. టైర్ల కదలిక కారణంగా అటు, ఇటు పడే మట్టి, దుమ్ము, నీటిని ఈ మడ్​ఫ్లాప్​తో కారు మెటల్​ బాడీకి తాకకుండా అడ్డుకోవచ్చు. మీ కారుకు మడ్​ఫ్లాప్​ లేకపోతే.. డీలర్​షిప్​ షోరూమ్​కు వెళ్లి దానిని ఫిట్​ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం