తెలుగు న్యూస్  /  బిజినెస్  /  M&m Q3 Results : క్యూ3లో.. 14శాతం పెరిగిన ఎం అండ్​ ఎం లాభాలు- అంచనాలు మిస్​!

M&M Q3 results : క్యూ3లో.. 14శాతం పెరిగిన ఎం అండ్​ ఎం లాభాలు- అంచనాలు మిస్​!

Sharath Chitturi HT Telugu

10 February 2023, 14:42 IST

google News
    • M&M Q3 results 2023 : క్యూ3లో ఎం అండ్​ ఎం లాభాలు 14శాతం పెరిగాయి. కానీ మార్కెట్​లో ఉన్న అంచనాలను సంస్థ అందుకోలేకపోయింది!
క్యూ3 ఫలితాలను విడుదల చేసిన ఎం అండ్​ ఎం
క్యూ3 ఫలితాలను విడుదల చేసిన ఎం అండ్​ ఎం (REUTERS)

క్యూ3 ఫలితాలను విడుదల చేసిన ఎం అండ్​ ఎం

M&M Q3 results 2023 : 2023 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికం ఫలితాలను శుక్రవారం ప్రకటించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఎం అండ్​ ఎం (మహీంద్రా అండ్​ మహీంద్రా). 2022 డిసెంబర్​తో ముగిసిన క్యూ3లో సంస్థ స్టాండెలోన్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 1,528కోట్లుగా నమోదైంది. ఇయర్​ ఆన్​ ఇయర్​తో పోల్చుకుంటే.. 14శాతం (రూ. 1,335కోట్లు) వృద్ధిని సాధించినట్టు. అయితే.. నెట్​ ప్రాఫిట్​పై మార్కెట్​లో ఉన్న అంచనాలను ఎం అండ్​ ఎం అందుకోలేకపోయింది! ఎం అండ్​ ఎం నికర లాభం రూ. 1,761కోట్లుగా ఉంటుందని మార్కెట్​ అంచనా వేసింది.

ఎం అండ్​ ఎం త్రైమాసిక ఫలితాలు..

ఎఫ్​వై23 క్యూ3లో ఎక్సెప్షనల్​ లాస్​గా రూ. 629కోట్లను ప్రకటించింది ఎం అండ్​ ఎం. అంతకుముందు త్రైమాసికంలో ఈ నెంబర్​ రూ. 248కోట్లుగా ఉండేది. ఇయర్​ ఆన్​ ఇయర్​ (ఎఫ్​వై22 క్యూ3) లో అసలు సంస్థకు నష్టాలే లేవు!

M&M Q3 results : ఇక ఎం అండ్​ ఎం ఆదాయం ఇయర్​ ఆన్​ ఇయర్​లో 41శాతం వృద్ధిచెంది రూ. 21,654కోట్లకు చేరింది. గతంలో ఇది రూ. 15,349కోట్లుగా ఉండేది. మరోవైపు సంస్థ ఖర్చులు రూ. 14,245 (ఇయర్​ ఆన్​ ఇయర్​) నుంచి రూ. 19,737కి పెరిగాయి.

LIC Q3 results : ఎల్​ఈసీ క్యూ3 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆటో, ఫార్మ్​ బిజినెస్​లో ఈసారి నమోదైన వాల్యూమ్​లు.. సంస్థ క్యూ3 చరిత్రలోనే అత్యధికమని ఎం అండ్​ ఎం వెల్లడించింది. ఫార్మింగ్​కి వినియోగించే వాహనాల సెక్టార్​లో ఎఫ్​వై23లో.. సంస్థ మార్కెట్​ షేరు 41శాతానికి పెరిగింది.

Mahindra and Mahindra : ఇక ప్యాసింజర్​ వెహికిల్​లో.. ఎస్​యూవీ సెగ్మెంట్​ ఎం అండ్​ ఎంకు కాసుల వర్షం కురిపిస్తోంది! ఎస్​యూవీ మార్కెట్​ షేర్​లో తం సంస్థ నెం.1గా కొనసాగుతోందని వెల్లడించింది. అంతేకాకుండా.. 2023 ఫిబ్రవరి 1 నాటికి తమ ఆర్డర్​బుక్​లో 2,66,000కుపైగా ఎస్​యూవీలు పెండింగ్​లో ఉన్నట్టు వివరించింది.

ఎం అండ్​ ఎం షేరు..

M&M share price target : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో మధ్యాహ్నం 2:30 నాటికి ఎం అండ్​ ఎం షేర్లు 1,370 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి ముందు.. లాభాల్లోనే ఉన్నప్పటికీ.. త్రైమాసిక ఫలితాలు అంచనాలను తప్పడంతో ఎం అండ్​ ఎం స్టాక్​ స్వల్ప నష్టాల్లోకి జారుకుని, మళ్లీ పుంజుకుంది.

ఇక ఈ ఎం అండ్​ ఎం షేరు గత ఐదు ట్రేడింగ్​ సెషన్స్​లో 0.3శాతం పతనమైంది. నెల రోజుల వ్యవధిలో 4.2శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8.3శాతం వృద్ధిచెందింది.

తదుపరి వ్యాసం