car sales : దూసుకెళుతున్న ఎంజీ మోటార్, టయోటా.. అదిరిన కార్ సేల్స్..!
01 July 2023, 13:39 IST
- MG Motor sales : జూన్ నెలకు సంబంధించిన కార్ సేల్స్ డేటాను విడుదల చేశాయి ఎంజీ మోటార్ ఇండియా, టయోటా సంస్థలు. ఆ వివరాలు..
భారీగా వృద్ధి చెందిన ఎంజీ మోటార్, టయోటా కార్ సేల్స్..!
MG Motor june car sales data : ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ వేగంగా వృద్ధిచెందుతున్నాయి. తాజాగా.. జూన్‌లో 5,125 యూనిట్ల సేల్స్‌తో 14శాతం వృద్ధిని సాధించింది ఆ సంస్థ. 2022 జూన్‌లో 4,504 వాహనాలను మాత్రమే విక్రయించింది.
"బిపర్జాయ్ తుపాను కారణంగా సప్లై దెబ్బతింది. అయినప్పటికీ డిమాండ్ మెరుగ్గానే ఉంది. ఇండియాలో పండుగ సీజన్ మొదలవ్వనుంది. అది సానుకూల విషయం," అని ఎంజీ మోటార్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మొత్తం మీద 14,682 యూనిట్లను విక్రయించింది ఎంజీ మోటార్. గతేడాది ఇదే త్రైమాసికంతో (10,519) పోల్చుకుంటే అది 40శాతం ఎక్కువగా ఉండటం విశేషం.
ఎంజీ మోటార్‌కు హెక్టార్ ఎస్యూవీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్‌ను లాంచ్ చేసింది. ఈ న్యూ జనరేషన్ హెక్టార్ ఎస్‌యూవీకి మంచి డిమాండే కనిపిస్తోంది.
ఇదీ చూడండి:- Toyota C HR SUV : 2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీని రివీల్ చేసిన టయోటా..
టయోటా కార్ సేల్స్ డేటా..
Toyota car sales data June 2023 : టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా.. జూన్ నెలకు సంబంధించిన కార్ సేల్స్ డేటాను విడుదల చేసింది. జూన్‌లో ఎగుమతులతో కలుపుకుని మొత్తం మీద 19,608 వాహనాలను విక్రయించింది. గతేడాది జూన్ (16,512)తో పోల్చుకుంటే ఇది 19శాతం వృద్ధిగా ఉంది. అయితే.. మే నెలతో పోల్చుకుంటే మాత్రం జూన్‌లో సంస్థ సేల్స్ స్వల్పంగా తగ్గాయి. మే నెలలో 20వేల వాహనాలను సేల్ చేసింది టయోటా సంస్థ.
ఇండియాలో జూన్ నెలలో 18,237 యూనిట్లను విక్రయించింది టయోటా. 1,371 వాహనాలను ఎగుమతి చేసింది. అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎస్యూవీ, హైక్రాస్ ఎంపీవీకి మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు సంస్థ చెబుతోంది. ఈ రెండింటితో పాటు ఫార్చ్యునర్ కూడా సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. కామ్రీ హైబ్రిడ్ సెడాన్, వెల్ఫైర్ ప్రీమియం ఎస్యూవీ, గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, హీలక్స్ వంటి మోడల్స్‌ను కూడా విక్రయిస్తోంది టయోటా.
ఎస్యూవీ, ఎంపీవీ, హైబ్రిడ్ మోడల్స్‌పై టయోటా సంస్థ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్స్‌లో పలు మోడల్స్ లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.