Affordable cars: సురక్షితమైన ఏడీఏఎస్ టెక్నాలజీ ఉన్న బెస్ట్ కార్లు ఇవే..
20 June 2023, 19:26 IST
ఇటీవల కార్ల ఉత్పత్తి సంస్థలన్నీ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రమాదాల బారిన పడకుండా పలు ఫీచర్లను తమ కార్లకు జోడిస్తున్నాయి. అందులో కీలకమైనది ఏడీఏఎస్. ఈ ఏడీఏఎస్ టెక్నాలజీ ఉన్న బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
ఏడీఏఎస్ టెక్నాలజీ ఉన్న కార్లు
ఏడీఏఎస్ (ADAS) అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (advanced driver assistance system). ఈ సిస్టమ్ కారు డ్రైవర్ సురక్షితంగా డ్రైవింగ్ చేసేలా వీలు కల్పిస్తుంది. ప్రయాణంలో అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేలా సహాయం చేస్తాయి. ఈ సిస్టమ్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి సురక్షిత విధానాలు ఉంటాయి. ఈ ఏడీఏఎస్ (ADAS) సిస్టమ్ ఉన్న, చవకగా లభించే కార్ల వివరాలు ఇవీ..
Honda City: హోండా సిటీ..
ఈ హోండా సిటీ (Honda City) హైబ్రిడ్ కారు ధర రూ. 18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కెమెరా బేస్డ్ ADAS సిస్టమ్ ఉంది. లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్ బీమ్ అడ్జస్ట్.. మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన హోండా సిటీ వీ, వీఎక్స్, జెడ్ఎక్స్ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ లో కూడా ఏడీఏఎస్ సిస్టమ్ ఉంది. హోండా సిటీ ఫిప్త్ జనరేషన్ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 11.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Hyundai verna: హ్యుండై వెర్నా
హ్యుండై నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ సెడాన్ లలో వెర్నా ఒకటి. ఈ కారులో కూడా లేటెస్ట్ గా ఏడీఏఎస్ ను పొందుపర్చారు. హ్యుండై కార్లలోని ఈ సేఫ్టీ ఫీచర్ ను స్మార్ట్ సెన్స్ గా పిలుస్తారు. ఏడీఏఎస్ ఉన్న ఈ కారు ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ ధర రూ. 14.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
MG Astor: ఎంజీ ఆస్టర్
ఎంజీ ఆస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ లో ADAS suite ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 16.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు డ్యాష్ బోర్డ్ లో పర్సనల్ ఏఐ అసిస్టెంట్ రోబో కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా, రూ. 15 లక్షల నుంచి రూ. 24 లక్షల్లో లభించే టాటా హ్యారియర్ లో, రూ. 19.44 లక్షల ఎక్స్ షో రూమ్ ధరలో లభించే మహింద్ర ఎక్స్యూవీ 700 లో కూడా ADAS ఉంది.