తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Cyberster Ev : ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ- అదిరిందిగా.. రేంజ్​ ఎంతంటే!

MG Cyberster EV : ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ- అదిరిందిగా.. రేంజ్​ ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

13 May 2023, 6:19 IST

google News
    • MG Cyberster EV revealed : ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ త్వరలోనే లాంచ్​ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ..
ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ.. (HT AUTO)

ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ..

MG Cyberster EV revealed : 'సైబర్​స్టర్​' ఈవీని యూకేలో ప్రదర్శించింది ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ ఎంజీ మోటార్​. త్వరలోనే ఇది యూకేలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ను ఇండియాలో లాంచ్​ చేసే ప్లాన్స్​ ప్రస్తుతం ఎంజీ మోటార్​కు లేవని సమాచారం. ఈ ఎంజీ సైబర్​స్టర్​ ఎలక్ట్రిక్​ రోడ్​స్టర్​ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ..

MG Cyberster EV sportscars : ఈ ఈవీకి సంబంధించిన కాన్సెప్ట్​ను 2020లోనే రివీల్​ చేసింది ఎంజీ మోటార్​. దీనికి ఓ స్పోర్ట్స్​ కారు లుక్​ ఉంటుంది. ఇటీవలే ముగిసిన షాంఘై ఆటో ఎక్స్​పోలో ఈ మోడల్​ను ప్రదర్శించింది. ఈ ఈవీ చాలా అట్రాక్టివ్​ లుక్స్​తో వస్తున్నట్టు స్పష్టమైపోయింది. పెద్ద బానెట్​, సిసర్​ డోర్స్​, అగ్రెసివ్​ బంపర్స్​, క్లీన్​ సైడ్​ ప్రొఫైల్​లు ఉండనున్నాయి. యారో షేప్​లోని ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​, వెహికిల్​ విడ్త్​ మొత్తం స్ట్రెచ్​ అయ్యే విధంగా ఉన్నా లైట్​బార్​లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులోని ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​ డిజైన్​.. పోర్షే నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినట్టు కనిపిస్తోంది.

ఇదీ చూడండి:- BMW X3 M40i launched : బీఎండబ్ల్యూ ఎక్స్​3 ఎం40ఐ లాంచ్​.. ధర ఎంతంటే!

డైమెన్షన్స్​ విషయానికొస్తే.. ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ పొడవు 4,535ఎంఎం. వెడల్పు 1,913ఎంఎం. ఎత్తు 1,329ఎంఎం. వీల్​బేస్​ 2,690ఎంఎం. కర్బ్​ వెయిట్​ 1,850 కేజీలు లేదా 1,985 కేజీలు ఉండొచ్చు. ఇందులో డ్యూయెల్​ మోటార్​, సింగిల్​ మోటార్​ వర్షెన్​లు ఉండనున్నాయి.

ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ- ధర..

MG Cyberster EV price : ఈ ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ టాప్​ స్పీడ్​ 200 కేఎంపీహెచ్​ అని తెలుస్తోంది. ఇందులోని యాక్సిల్​ మౌంటెడ్​ ఎలక్ట్రిక్​ మోటార్​ 201 హెచ్​పీ పవర్​ను, రేర్​- యాక్సిల్​ మౌంటెడ్​ ఎలక్ట్రిక్​ మోటార్​ 335 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తాయి. బ్యాటరీ ప్యాక్​ వివరాలు ఇంకా తెలియలేదు. కాగా.. ఇందులో 64 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్​ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 800కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

MG Cyberster EV launch : యూకేలో ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర 50,000 పౌండ్లుగా ఉండొచ్చు. అంటే సుమారు రూ. 51.19లక్షలు!

తదుపరి వ్యాసం