తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pure Ev Epluto 7g Pro : ఈప్లూటో 7జీ ప్రో- ఓలా ఎలక్ట్రిక్​ కన్నా ధర తక్కువ.. రేంజ్​ ఎక్కువ!

Pure EV ePluto 7G pro : ఈప్లూటో 7జీ ప్రో- ఓలా ఎలక్ట్రిక్​ కన్నా ధర తక్కువ.. రేంజ్​ ఎక్కువ!

Sharath Chitturi HT Telugu

12 May 2023, 13:41 IST

google News
    • Pure EV ePluto 7G pro : ప్యూర్​ ఈవీ సంస్థ.. ఈప్లూటో 7జీ ప్రోను మార్కెట్​లోకి దింపింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫీచర్స్​, రేంజ్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఈప్లూటో 7జీ ప్రో- ఓలా ఎలక్ట్రిక్​ కన్న ధర తక్కువ.. రేంజ్​ ఎక్కువ!
ఈప్లూటో 7జీ ప్రో- ఓలా ఎలక్ట్రిక్​ కన్న ధర తక్కువ.. రేంజ్​ ఎక్కువ! (HT AUTO)

ఈప్లూటో 7జీ ప్రో- ఓలా ఎలక్ట్రిక్​ కన్న ధర తక్కువ.. రేంజ్​ ఎక్కువ!

Pure EV ePluto 7G pro : ఎలక్ట్రిక్​ టూ-వీలర్​ స్టార్టప్​ సంస్థ ప్యూర్​ ఈవీ.. 'ఈప్లూటో 7జీ ప్రో' స్కూటర్​ను ఇండియా మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 94,999. ఇదొక టాప్​ ఎండ్​ మోడల్​. మాట్​ బ్లాక్​, గ్రే, వైట్​ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ప్యూర్​ ఈవీ డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ స్కూటర్​ను బుక్​ చేసుకోవచ్చు. ఈ నెల చివర్లో డెలివరీలను ప్రారంభిస్తామని సంస్థ చెప్పింది.

ప్యూర్​ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో- ఫీచర్స్​..

ఈకోడ్రిఫ్ట్​ మోటార్​సైకిల్​ ప్లాట్​ఫార్మ్​పై ఈ స్కూటర్​ను రూపొదించారు. 1.5కేడబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​ ఇందులో ఉంటుంది. 2.4కేడబ్ల్యూ ఎంసీయూ, సీఏఎన్​ ఆధారిత ఛార్జర్​ ఉంటాయి. ఇందులో 3.0కేడబ్ల్యూహెచ్​ ఏఐఎస్​ 156 సర్టిఫైడ్​ బ్యాటరీ లభిస్తుండటం విశేషం. స్మార్ట్​ బీఎంఎస్​, బ్లూటూత్​ కనెక్టివిటీ సైతం వస్తున్నాయి.

Pure EV ePluto 7G pro price : ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. 100-150 కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఈవీలో ఉన్న మూడు మోడ్స్​ బట్టి రేంజ్​ మారుతుందని పేర్కొంది. నాలుగు వేరువేరు మైక్రోకంట్రోలర్స్​, వివిధ సెన్సార్​లతో స్మార్ట్​ఫోన్​ కన్నా ఎక్కువ ప్రాసెసింగ్​.. ఈ స్కూటర్​కు ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- EV Chargers: కస్టమర్లకు ఆ డబ్బును రీఫండ్ చేయనున్న ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్

"మా బెస్ట్​ సెల్లింగ్​ 7జీ మోడల్​కు ఇది అప్​గ్రేడెడ్​ వర్షెన్​. మా ఇన్నోవేషన్​, సస్టైనబులిటీ, ఎక్సలెన్స్​కు ఇది చిహ్నం. ప్రీలాంచ్​కు ముందే ఈ ఈవీపై 5వేలమందికిపైగా ఆసక్తి చూపించారు. లాంచ్​ అయిన 2వేలకుపైగా బుకింగ్స్​ వస్తాయని ఆశిస్తున్నాము," అని ప్యూర్​ ఈవీ కో-ఫౌండర్​, సీఈఓ రోహిత్​ వదేరా తెలిపారు.

గట్టి పోటీ తప్పదు..!

Pure EV ePluto 7G pro range : ప్యూర్​ ఈవీలు ఇప్పటికే మార్కెట్​లో ఉన్నాయి. ఎఫ్​వై24 ముగింపు నాటికి 300 టచ్​పాయింట్స్​ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ఒకినావా, అంపేరే, హీరో ఎలక్ట్రిక్​కు ఈ ఈప్లూటో 7జీ ప్రో గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం