MG Comet EV: ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు ధర ఇదే: అధికారికంగా లాంచ్: అంచనాల కంటే తక్కువ రేటుకే!
MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ, రేంజ్, ధర, పర్ఫార్మెన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
MG Comet EV Electric Car: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇండియాలో అధికారికంగా లాంచ్ అయింది. ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ముఖ్యంగా సిటీల్లో తిరిగేందుకు ఈ ఎంజీ కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. MG Comet EV Electric Car పూర్తి వివరాలు ఇవే.
ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర
MG Comet EV Price: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీన్ని ఇంట్రడక్టరీ ధరగా ఎంజీ మోటార్స్ పేర్కొంది. బుకింగ్‍లు మే 15వ తేదీన ఓపెన్ అవుతాయి. ఈ కారు ధర రూ.10లక్షల దరిదాపుల్లో ఉంటుందని అంచనాలు వెలువడగా.. అంతకంటే తక్కువ ఇంట్రడక్టరీ ధరలోనే ఎంజీ కామెట్ ఈవీ వచ్చింది.
స్మాల్ ఎలక్ట్రిక్ కారుగా..
MG Comet EV: స్మాల్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్ ఈవీ వచ్చింది. ఈ కారు లెంగ్త్ 2,974 మీల్లీమీటర్లు (mm)గా ఉంది. పొడవు 1,640 mm, వెడల్పు 1505mmగా ఉంది. 12 ఇంచుల వీల్‍లతో ఈ కారు వచ్చింది. టూ డోర్ మోడల్‍గా అడుగుపెట్టింది.
బ్యాటరీ, రేంజ్ ఎలా..
MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా ఈ కారు రేంజ్ ఉంటుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‍లతో ఈ నయా ఎలక్ట్రిక్ కారు వచ్చింది.
పర్ఫార్మెన్స్
MG Comet EV: సింగిల్ మోటార్‌లో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంది. 41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ఇది ప్రొడ్యూజ్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
MG Comet EV Features: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు లోపల 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్‍లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‍మెంట్ డిస్‍ప్లేగా ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‍ప్లేగా ఉంటుంది. కంట్రోల్‍లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది.
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ఫీచర్లు ఉంటాయి.
కలర్ ఆప్షన్‍లు
MG Comet EV: వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్‍లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బ్లాక్ రూఫ్‍తో గ్రీన్, బ్లాక్ రూఫ్‍తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
టాటా టియాగో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కార్లకు ఎంజీ కామెట్ ఈవీ పోటీగా అడుగుపెట్టింది.