తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Meta Threads : ట్విట్టర్​కు పోటీగా మెటా ‘థ్రెడ్స్​’.. ఈ వారంలోనే లాంచ్​

Meta Threads : ట్విట్టర్​కు పోటీగా మెటా ‘థ్రెడ్స్​’.. ఈ వారంలోనే లాంచ్​

Sharath Chitturi HT Telugu

04 July 2023, 7:54 IST

google News
  • Meta Threads : ట్విట్టర్​కు పోటీగా మార్క్​ జుకర్​బర్గ్​ తయారు చేసిన మెటా థ్రెడ్స్​.. ఈ నెల 6న లాంచ్​ కానుంది. పూర్తి వివరాలు..

ట్విట్టర్​కు పోటీగా మెటా ‘థ్రెడ్స్​’.. ఈ వారంలోనే లాంచ్​
ట్విట్టర్​కు పోటీగా మెటా ‘థ్రెడ్స్​’.. ఈ వారంలోనే లాంచ్​

ట్విట్టర్​కు పోటీగా మెటా ‘థ్రెడ్స్​’.. ఈ వారంలోనే లాంచ్​

Meta Threads launch date : ఫేస్​బుక్​ పేరెంట్​ కంపెనీ మెటా.. మరో సోషల్​ మీడియా యాప్​తో ప్రజల ముందుకు రానుంది. ట్విట్టర్​కు పోటీగా తీసుకోస్తున్న ఈ 'థ్రెడ్స్​'ను.. ఈ గురువారం (జులై 6) లాంచ్​ చేయనుంది. యాపిల్​ యాప్​ స్టోర్​ లిస్టింగ్​ ద్వారా ఈ విషయం తెలిసింది. యూరోప్​లోని గూగుల్​ ప్లే స్టోర్​లో ఈ యాప్​ సోమవారం దర్శనమిచ్చింది. రాత్రి నాటికి యాపిల్​ యాప్​ స్టోర్​లో కూడా కనిపించింది.

ట్విట్టర్​కు పోటీగా..

అపరకుబేరుడు ఎలాన్​ మస్క్​ ట్విట్టర్​ను కొనుగోలు చేసిన తర్వాత నుంచి సామాజిక మాధ్యమ దిగ్గజం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ట్విట్టర్​కు వివిధ మార్పులు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు ఎలాన్​ మస్క్​. ఫేస్​బుక్​ ఓనర్​ మార్క్​ జుకర్​బర్గ్​కు ఇదే సరైన సమయం! అందుకే ట్విట్టర్​కు ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్​ను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లాంచ్​ డేట్​ను గురువారంగా ఫిక్స్​ చేశారు. మరోవైపు ట్విట్టర్​ కొత్త నిబంధనలపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్న అడ్వర్టైజర్లకు మోటా థ్రెడ్స్​ మంచి ఆప్షన్​ అవుతుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఇదీ చూడండి:- Twitter | ఎలాన్‌ మస్క్‌ మరో ట్విస్ట్‌.. రోజుకు 600 ట్వీట్లు మాత్రమే చదవొచ్చంటూ పరిమితులు

Meta Threads App : యాప్​ స్టోర్​లో ప్రస్తుతం 'ప్రీ ఆర్డర్​'తో అందుబాటులో ఉంది ఈ థ్రెడ్స్​. యాప్​ స్టోర్​ లిస్టింగ్​ ప్రకారం.. సమాజాలు ఒక చోట చేరి వివిధ అంశాలు, ట్రెండింగ్​ టాపిక్స్​పై చర్చలు జరుపుకునేందుకు, ఫేవరెట్​ క్రియేటర్లతో కనెక్ట్​ అయ్యేందుకు ఈ మెటా థ్రెడ్స్​ ఉపయోగపడుతుంది. ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ కలయికలో ఈ యాప్​ ఉంటుంది. ఫలితంగా ఇన్​స్టాగ్రామ్​ యూజర్లు ఇందులో చేరుతారని సంస్థ భావిస్తోంది.

నెటిజన్ల స్పందన..

ఈ మెటా థ్రెడ్స్​ లాంచ్​పై ట్విట్టర్​లో నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు థ్రెడ్స్​ కోసం ఎదురుచుస్తున్నామని అంటుంటే.. ఇంకొందరు మాత్రం ట్విట్టర్​లోనే ఉంటామని చెబుతున్నారు.

'ఎలాన్​ మస్క్​పై నమ్మకం ఉంచండి. ట్విట్టర్​లో కొనసాగండి', అని ఓ వ్యక్తి కామెంట్​ చేయగా.. 'ఎన్ని యాప్​లు వచ్చినా.. ట్విట్టర్​ను ఢీకొట్టడం కష్టం,' అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.​

తదుపరి వ్యాసం