Noida rape case : 10వ తరగతి విద్యార్థినిపై ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అత్యాచారం..!
Noida rape case : 10వ తరగతి చదువుకుంటున్న బాలికపై తన ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Noida rape case : నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్టు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
సంబంధిత బాధితురాలు తన కుటుంబంతో కలిసి నోయిడాలో నివాసముంటోంది. ఆమె వయస్సు 17ఏళ్లు. మరోవైపు 20ఏళ్ల నిందితుడు.. సమీపంలోని హార్పూర్ జిల్లాలో జీవిస్తున్నాడు. కాగా.. వీరిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో కలుసుకున్నారు. కొంతకాలం ఛాటింగ్ చేసుకున్నారు.
తనతో బయటకు రావాలని నిందితుడు.. అనేకమార్లు బాలికను కోరాడు. అందుకు ఒప్పుకున్న బాలిక.. ఈ నెల 6న అతనితో బయటకు వెళ్లింది. ఆ రోజు రాత్రి ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు!
కూతురు ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక రోజు వ్యవధిలో బాలికను రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు అసలేం జరిగిందని బాలికను విచారించారు. ఈ క్రమంలోనే బాలిక అసలు విషయం చెప్పింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి తనని పిలిచినట్టు, అతనితో వెళ్లినట్టు ఆమె పేర్కొంది. అప్పుడే తనపై ఆ వ్యక్తి అత్యాచారం చేసినట్టు వివరించింది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని.. పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధితురాలి కుటుంబానికి హామీనిచ్చారు.
దిల్లీలో మైనర్‌పై..
Delhi gang rape case : దేశంలో మహిళలు, బాలికలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దిల్లీలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
వాయువ్య దిల్లీలోని షహ్బాద్ డైరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు, తన ఫ్రెండ్‌తో కలిసి సమీపంలోని పార్క్‌కు వెళ్లింది. నలుగురు నిందితులు అక్కడికి వెళ్లారు. వారిద్దరిని బెదిరించారు. ఈ క్రమంలో బాధితురాలి ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం బాధితురాలిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నిందితులను గుర్తించారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నడని తెలుసుకున్నారు. నలుగురిలో ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనం