Maruti Suzuki chip shortage : చిప్ కొరతతో మారుతీకి చింత! ఇంకొన్ని నెలలు తప్పదు!
05 March 2023, 22:20 IST
- Maruti Suzuki chip shortage news : సెమీకండక్టర్ల కొరత.. మారుతీ సుజుకీపై భారీగానే పడింది. మరి కొన్ని నెలల పాటు ఈ సమస్య వెంటాడుతుందని సంస్థ చెప్పింది. ఫలితంగా పలు డిమాండ్ ఉన్న మోడల్స్ వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
చిప్ కొరతతో మారుతీకి చింత!
Maruti Suzuki chip shortage : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీని సెమీకండక్టర్ చిప్స్ కొరత వెంటాడుతోంది. మరికొన్ని త్రైమాసికాల పాటు చిప్‌ల కొరత ఉంటుందని సంస్థ పేర్కొంది. ఫలితంగా పలు మోడల్స్‌కు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెరుగుతుందని స్పష్టం చేసింది.
వెయిటింగ్.. వెయిటింగ్.. వెయిటింగ్..
ప్రస్తుతం.. మారుతీ సుజుకీ పెండింగ్ ఆర్డర్ల సంఖ్య 3.69లక్షలుగా ఉంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఎర్టిగాకు అత్యధిక ఆర్డర్లు (94వేలు) పెండింగ్‌లో ఉన్నాయి. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, బ్రెజా ఎస్‌యూవీలకు వరుసగా 37వేలు, 61,500 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన మారుతీ సుజుకీ జిమ్నీ, ఫ్రాంక్స్‌లకు ఇప్పటివరకు 22,000- 12,000 ఆర్డర్లు వచ్చాయి. వీటి ప్రొడక్షన్ ఇంకా మొదలవ్వలేదు.
Maruti Ertiga waiting period : చిప్‌ల కొరత కారణంగా గతేడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో.. అంచనాల కన్నా 46వేల యూనిట్లను తక్కువగా తయారు చేసింది మారుతీ సుజుకీ. అప్పటికే పెండింగ్ ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇక ఇప్పుడు కూడా సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుందని సంస్థ చెబుతుండటం గమనార్హం.
"సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుంది. సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయి అని ఇప్పుడే చెప్పడం కష్టం. మాకైతే.. సాధారణ పరిస్థితులు సమీప భవిష్యత్తు దూరంలో కూడా కనిపించడం లేదు," అని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్- సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ శ్రీవాస్తవ తెలిపారు.
ప్యాసింజర్ వాహనాలు.. రయ్రయ్..!
Maruti Suzuki pending orders : ప్యాసింజర్ వెహికిల్ సెగ్మెంట్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీవాస్తవ. ఇండియా పీవీ సెగ్మెంట్లో ఎస్‌యూవీలకు 42.6శాతం వాటా ఉందని, హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ మార్కెట్ షేరు 35శాతంగా ఉందని వివరించారు. ఈ ఆర్థిక ఏడాదిలో పీవీ సెగ్మెంట్లో 35.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని, ఈ నెల చివరి నాటికి అది 38.8లక్షల యూనిట్లు దాటుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే.. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అవుతుందని పేర్కొన్నారు.
Chip Shortage Indian Auto industry : 2022-23 ఆర్థిక ఏడాదితో పోల్చుకుంటే.. రానున్న ఫైనాన్షియల్ ఇయర్లో పీవీ సెగ్మెంట్ 5-7శాతం వృద్ధిచెందుతుందని శ్రీవాస్తవ తెలిపారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో 40.5లక్షలు -41లక్షల యూనిట్లు అమ్ముడుపోతాయని అంచనావేస్తున్నట్టు వివరించారు. ఇండస్ట్రీ కన్నా మారుతీ సుజుకీ ప్రదర్శన మెరుగ్గా ఉంటుందని అశాభావం వ్యక్తం చేశారు.