Maruti Suzuki Q1 results : క్యూ1లో.. 145శాతం పెరిగిన మారుతీ సుజుకీ నికర లాభం!
31 July 2023, 17:23 IST
Maruti Suzuki Q1 results : జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికర లాభం 145శాతం పెరిగింది! ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
క్యూ1లో.. 145శాతం పెరిగిన మారుతీ సుజుకీ నికర లాభం!
Maruti Suzuki Q1 results : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. ఎఫ్వై24 క్యూ1 ఫలితాలను సోమవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ స్టాండెలోన్ నెట్ ప్రాఫిట్ రూ. 2,485.1 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 145శాతం (రూ. 1,012.8కోట్లు) అధికం! సేల్స్ వాల్యూమ్ వృద్ధిచెందడంతో పాటు చిప్ కొరత తగ్గడం వంటి అంశాలు సంస్థకు కలిసివచ్చాయి. ఈ ఫలితాలు మార్కెట్ అంచనాల కన్నా మించి ఉన్నాయి.
మరోవైపు ఎఫ్వై23 క్యూ4తో (రూ. 2,623.6) పోల్చుకుంటే మాత్రం.. సంస్థ నికర లాభాలు స్వల్పంగా తగ్గాయి. ఇక ఈ త్రైమాసికంలో మారుతీ సుజుకీ స్టాండెలోన్ రెవెన్యూ 22శాతం వృద్ధిచెంది.. రూ. 32,326.9 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 26,499కోట్లుగా ఉంది.
ఇక ఈ ఏడాది ఏప్రిల్- జూన్‌లో 4,98,030 వాహనాలను సేల్ చేసింది మారుతీ సుజుకీ. గతేడాది ఇదే కాలవ్యవధితో పోల్చుకుంటే.. ఇది 6.4శాతం అధికం. ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోకు మంచి డిమాండ్ కనిపిస్తోందని సంస్థ చెప్పింది.
ఎఫ్వై24 మొదటి త్రైమాసికంలో దేశీయంగా 4,34,812 యూనిట్లను విక్రయించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. 63,218 యూనిటల్ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఎఫ్వై23 క్యూ1లో ఈ నెంబర్ 69,437గా ఉండేది.
ఇదీ చూడండి:- IDFC First Bank : ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇప్పుడు కొనొచ్చా? టార్గెట్ రూ. 140?
"ఎలక్ట్రానిక్ పరికరాల కొరత సమస్య దిగొస్తోంది. కానీ సమస్య ఇంకా ఉంది. అందుకే సాధారణం కన్నా 28వేల యూనిట్లను తక్కువగా తయారు చేశాము. సంస్థ ఆర్డర్ బుక్‌లో 3,55,000 వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వేగంగా పూర్తి చేసేందుకు సంస్థ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది," అని మారుతీ సుజుకీ వెల్లడించింది.
మరోవైపు సుజుకీ మోటార్ కార్పొరేషన్ నుంచి సుజుకీ మోటార్ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు సంస్థ బోర్డు ఆమోదించింది. ఈ క్రమంలో ఎస్ఎంజీతో మేన్యుఫ్యాక్చరింగ్ అగ్రీమెంట్‌ను రద్దు చేసుకుంటున్నట్టు, అదే సమయంలో అందులో 100శాతం వాటాను అక్వైర్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
మారుతీ సుజుకీ షేర్ ప్రైజ్..
Maruti Suzuki share price today : సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి మారుతీ సుజుకీ షేర్లు 1.48శాతం వృద్ధిచెంది రూ. 9,813 వద్ద ముగిశాయి. ఈ స్టాక్ ఐదు రోజుల్లో 1.42శాతం, నెల రోజుల్లో 1.45శాతం మేర పెరిగింది. ఇక గత ఆరు నెలల్లో 11.91శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16.8శాతం, ఏడాది కాలంలో 8.99శాతం లాభపడింది.