తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Electric Car : టెస్ట్​ రన్​ దశలో మారుతీ సుజుకీ తొలి ఈవీ.. మరి లాంచ్​ ఎప్పుడు?

Maruti Suzuki electric car : టెస్ట్​ రన్​ దశలో మారుతీ సుజుకీ తొలి ఈవీ.. మరి లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

23 June 2023, 13:11 IST

google News
    • Maruti Suzuki electric car : మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఈవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​కి సంబంధించి ఒక వార్త బయటకొచ్చింది.
టెస్ట్​ రన్​ దశలో మారుతీ సుజుకీ తొలి ఈవీ..
టెస్ట్​ రన్​ దశలో మారుతీ సుజుకీ తొలి ఈవీ..

టెస్ట్​ రన్​ దశలో మారుతీ సుజుకీ తొలి ఈవీ..

Maruti Suzuki electric car : దేశంలో ఈవీ సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. అయితే.. దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీకి మాత్రం ఈ సెగ్మెంట్​లో ఒక్క మోడల్​ కూడా లేదు. దీనిని భర్తీ చేసేందుకే ఓ ఎలక్ట్రిక్​ కారును సంస్థ సిద్ధం చేస్తోంది. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో.. ఈ ఈవీఎక్స్​ కాన్సెప్ట్​ను ప్రదర్శించింది. తాజాగా ఈ ఈవీకి సంబంధించిన ఒక వార్త బయటకొచ్చింది. ప్రోటోటైప్​ మోడల్​పై.. యూరోప్​లో టెస్టింగ్​ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా వైరల్​గా మారింది.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​..

జపాన్​కు చెందిన టయోటాతో మారుతీ సుజుకీకి ఇప్పటికే అనేక సెగ్మెంట్​లలో ఒప్పందాలు ఉన్నాయి. ఇక ఈవీల కోసం ఈ రెండు సంస్థలు కలిసి ఓ కొత్త ప్లాట్​ఫార్మ్​ను రూపొందిస్తున్నాయి. గుజరాత్​లోని ఫ్యాక్టరీలో ఈవీలను తయారు చేసి.. దేశ, విదేశాల్లో విక్రయించాలని మారుతీ సుజుకీ ప్లాన్​ చేస్తోంది. ఇందులో భాగంగా.. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ వెహికిల్​.. 'ఈవీఎక్స్'​ మోడల్​ 2025లో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తోంది.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​లో మస్క్యులర్​ బానెట్​, క్లోజ్​డ్​ ఆఫ్​ గ్రిల్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, వీ షేప్​ డీఆర్​ఎల్స్​, రేక్​డ్​ విండ్​స్క్రీన్​, వైడ్​ ఎయిర్​ డామ్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​లు రేర్​లో వస్తున్నాయి.

ఇదీ చూడండి:- Bajaj Auto electric scooters : బజాజ్​ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!

ఈ మోడల్​ ఇంటీరియర్​కు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాగా.. స్పెషియస్​ కేబిన్​లో హెడ్​ అప్​ డిస్​ప్లే, యాంబియెంట్​ లైటింగ్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, భారీ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి ఉండొచ్చు.

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్​ టెక్నాలజీతో పాటు ఇతర ఫీర్స్​ ఉండనున్నాయి.

Maruti Suzuki eVX : ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించిన ఈవీఎక్స్​ కాన్సెప్ట్​లో.. 60 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో కూడిన డ్యూయెల్​ మోటార్​ సెటప్​ ఉంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 550కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.

లాంచ్​ తర్వాత.. ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 18-20లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం