Alto K10 CNG launch : ఆల్టో కే10 సీఎన్జీ వర్షెన్ లాంచ్.. ధర ఎంతంటే!
19 November 2022, 7:54 IST
- Maruti Alto K10 CNG launched in India : ఆల్టో కే10లో సీఎన్జీ వర్షెన్‌ను లాంచ్ చేసింది మారుతీ సుజుకీ. ఈ కొత్త వర్షెన్కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆల్టో కే10 సీఎన్జీ వర్షెన్ లాంచ్.. ధర ఎంతంటే
Maruti Alto K10 CNG launched in India : మారుతీ సుజుకీ నుంచి మరో సీఎన్జీ కారు వచ్చేసింది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 సీఎన్జీని.. ఆ సంస్థ శుక్రవారం లాంచ్ చేసింది. ఈ సీఎన్జీ వర్షెన్ ధర రూ. 5.95లక్షలు(ఎక్స్‌షోరూం) ధరగా ఉంది. అయితే.. కేవలం ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 అందుబాటులో ఉంది. ఆల్టో కే10 పెట్రోల్ వర్షెన్‌తో పోల్చుకుంటే.. సీఎన్జీ వర్షెన్ ధర రూ. 95,000 అధికంగా ఉంది.
ఈ మారుతీ సుజుకీ ఆల్టో కే10 సీఎన్జీలో 1.0లీటర్ కే10సీ ఇంజిన్ ఉంటుంది. మారుతీకి చెందిన ఇతర వాహనాలు సెలేరియో సీఎన్జీ, ఎస్ ప్రెస్సో సీఎన్‌జీలోనూ ఇదే ఇంజిన్ ఉంది. ఆల్టో కే10 సీఎన్జీలో 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ ఉంది. పెట్రోల్ ఓన్లీ మోడ్‌లో ఈ వాహనం 65హెచ్‌పీ పవర్, 89ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీ మోడ్‌లో.. 57హెచ్‌పీ పవర్, 82ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇండియాలో.. రూ. 1లక్షల లోపు లభిస్తున్న టాప్ సీఎన్జీ వాహనాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Maruti Alto K10 CNG price : కొత్త ఆల్టో కే10 సీఎన్జీ మైలేజీ.. 33.85కి.మీ/కేజీగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఆల్టో కే10 సీఎన్జీ.. ఎస్ ప్రెస్సో సీఎన్జీ కన్నా 1.12కిమీ/కేజీ మైలేజీని అధికంగా ఇస్తుంది. కానీ సెలరియా సీఎన్జీ వర్షెన్‌తో పోల్చుకుంటే.. ఇది 1.75కి.మీ/కేజీ తక్కువ.
ఆల్టో కే10 సీఎన్జీకి.. పెట్రోల్ వర్షెన్కు ఉన్న డిజైనే ఉంటుంది. ఎస్ సీఎన్జీ బ్యాడ్జ్ రేర్‌లో ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ బూట్లో 55లీటర్ సీఎన్జీ ట్యాంక్‌ను ఏర్పాటు చేసింది మారుతీ. ఫలితంగా స్టోరేజ్ స్పేస్ కాస్త తగ్గింది.
Maruti Alto K10 CNG : ఆల్టో కే10 సీఎన్జీకి.. ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్ ఇంటీరియర్‌కి కూడా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. 2డిన్ స్మార్ట్‌ప్లే ఆడియో సిస్టెమ్, ఏయూఎక్స్-యూఎస్బీ పోర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి. డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్స్.. ఈ సీఎన్జీ వర్షెన్‌లో ఉన్నాయి.
మారుతీ ఆల్టో కే10 సీఎన్జీకి.. ఆల్టో 800సీఎన్జీ, ఎస్ ప్రెస్సో సీఎన్జీలు పోటీగా ఉండనున్నాయి. ఆల్టో 800 సీఎన్జీ ధర రూ. 5.03లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది. ఇక ఎస్ ప్రెస్సో సీఎన్జీ ధర రూ. 5.90లక్షలు- 6.10లక్షల(ఎక్స్‌షోరూం) మధ్యలో ఉంది.
Maruti Alto K10 CNG launch : సీఎన్జీ ధరలు పెరుగుతున్నా.. ఈ వర్షెన్ కార్లకు డిమాండ్ తగ్గడం లేదని మారుతీ పేర్కొంది. పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే.. దీర్ఘకాలంలో సీఎన్జీ ధరలతో లబ్ధిపొందవచ్చని కస్టమర్లు భావిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్టుగానే.. సీఎన్జీ వేరియంట్లను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.