Maruti Suzuki Baleno S-CNG : బలెనో, ఎక్స్ఎల్6కి 'సీఎన్జీ' టచ్.. ధరలు ఎంతంటే!
31 October 2022, 17:29 IST
- Maruti Suzuki Baleno S-CNG Launched in India : బలెనో, ఎక్స్ఎల్6 మోడల్స్‌కు సీఎన్జీ టచ్ ఇచ్చింది మారుతీ సుజుకీ. వీటిని సోమవారం లాంచ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బలెనో, ఎక్స్ఎల్6కి 'సీఎన్జీ' టచ్.. ధరలు ఎంతంటే!
Maruti Suzuki Baleno S-CNG Launched in India : బలెనో, ఎక్స్ఎల్6 మోడల్స్‌కు సంబంధించిన సీఎన్జీ వేరియంట్లను సోమవారం లాంచ్ చేసింది మారుతీ సుజుకీ. నెక్సా రేంజ్ నుంచి సీఎన్జీ టెక్నాలజీతో వస్తున్న తొలి మోడల్స్‌గా బలెనో, ఎక్స్ఎల్6 నిలిచాయి. కాగా.. మారుతీకి చెందిన ఎన్నో సీఎన్జీ కార్లు ఇప్పటికే రోడ్డు మీద ఉన్నాయి.
ఎస్-సీఎన్జీ టెక్నాలజీతో..
సీఎన్జీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోందని మారుతీ పేర్కొంది. రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందని కస్టమర్లు ఆలోచిస్తున్నట్టు వివరించింది. అందుకే.. సీఎన్జీ వాహనాలను లాంచ్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
Maruti Suzuki Baleno S-CNG : మారుతీ సుజుకీ బలెనో ఎస్- సీఎన్జీ డెల్టా వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.28లక్షలుగా ఉంది. ఇక జెటా వేరియంట్ ధర రూ. 9.21లక్షలుగా ఉంది. ఎక్స్ఎల్6 సీఎన్జీ జెటా వేరియంట్ ధర రూ. 12.24లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలు. అంటే.. బలెనో నుంచి రెండు సీఎన్జీ వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఎక్స్ఎల్6 నుంచి ఒకటి మాత్రమే లభిస్తోంది.
డీజిల్ ఇంజిన్లకు ఇప్పటికే స్వస్తి చెప్పిన మారుతీ సుజుకీ.. సీఎన్జీ కార్లకు ప్రాధాన్యత ఇస్తోంది. వాగన్ఆర్, ఆల్టో, ఈకో వేరియంట్లకు 2010లోనే సీఎన్జీ టెక్నాలజీని ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. బలెనో, ఎక్స్ఎల్6 మోడల్స్‌కు ‘ఎస్-సీఎన్జీ’ టెక్నాలజీని సమకూర్చింది. మొత్తం మీద ప్రస్తుతం మారుతీ వద్ద 12 సీఎన్జీ మోడల్స్ ఉన్నాయి.
Maruti Suzuki XL6 S-CNG హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో బలెనో, ప్రీమియం సెగ్మెంట్లో ఎక్స్ఎల్6కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ రెండు మోడల్స్‌కి అప్డేట్ వర్షెన్‌ను మార్కెట్లో విడుదల చేసింది మారుతీ సుజుకీ.
ఇక బలెనో ఎస్-సీఎన్జీ.. 600 ఆర్పీఎం వ్ద 77.49పీఎస్, 4300 ఆర్పీఎం 98.5ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఎక్స్ఎల్6 ఎస్ సీఎన్జీ.. 5,500 ఆర్పీఎం వద్ద 87.83పీఎస్‌ను, 4,200 ఆర్పీఎం వద్ద 121.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండ వాహనాలను కొనుగోలు చేయకుండానే మీరు మీ సొంతం చేసుకోవచ్చు! బలెనో ఎస్ సీఎన్జీకీ నెలకు రూ. 18,403.. ఎక్స్ఎల్6 ఎస్-సీఎన్జీకి నెలకు రూ. 30,821 చెల్లించి సబ్స్క్రిప్షన్ మోడ్‌లో కార్లను పొందవచ్చు.
త్రైమాసిక ఫలితాలు..
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(Q2)లో మారుతీ సుజుకీ వాహన శ్రేణి అమ్మకాల విలువ రూ. 28,543.5 కోట్లుగా తేలింది. అలాగే, లాభాలు గత సంవత్సరం Q2తో పోలిస్తే.. నాలుగు రెట్లు పెరిగాయి. మారుతీ సుజుకీ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.