Mahindra Thar 5 door : ఆగస్ట్ 15న మహీంద్రా థార్ 5 డోర్ లాంచ్..!
24 June 2024, 19:00 IST
- Mahindra Thar 5 door : మహీంద్రా థార్ ఆర్మాడాగా పిలుస్తున్న 5 డోర్ వెహికిల్ లాంచ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ వెహికిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా థార్ అర్మాడా
Mahindra Thar Armada launch : మచ్ అవైటెడ్ కార్స్ లాంచ్‌లో.. మహీంద్రా థార్ 5 డోర్ ఒకటి. కాగా.. ఈ మహీంద్రా థార్ 5 డోర్.. ఆగస్టు 15, 2024 న లాంచ్ అవుతుందని సమాచారం. ఇక సంస్థ దీనికి.. 'థార్ అర్మాడా' అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా థార్ 5 డోర్..
ఈ మహీంద్రా థార్ ఆర్మాడాకు సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే అనేకమార్లు జరిగింది. పైగా.. వీటి స్పై షాట్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటి ద్వారా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. 3 డోర్ లే- అవుట్‌ని ఇందులో అస్సలు వాడలేదు. వీల్‌బేస్‌ని పెంచి.. 5 డోర్ లే-అవుట్‌ని డిజైన్ చేసింది సంస్థ. ఫలితంగా.. రేర్ ప్యాసింజర్లకు స్పేస్ ఎక్కువగానే ఉంది. కార్గోకు కూడా స్పేస్ సరిపోతుంది.
విజువల్‌గా మాత్రం.. మహీంద్రా థార్ అర్మాడా కొన్ని విలక్షణమైన అంశాలతో పాటు మూడు డోర్ల సిబ్లింగ్కి చెందిన పలు ఆకర్షణీయమైన ఫీచర్స్‌ని నిలుపుకుంటుంది. కొత్త థార్‌లో ప్రొజెక్టర్ సెటప్‌లతో కూడిన సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్లైట్లు ఉంటాయని స్పై షాట్స్ తేల్చాయి. సిగ్నేచర్ ఫెండర్-మౌంటెడ్ మార్కర్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. కానీ గ్రిల్‌ని సంస్థ రీడిజైన్ చేసింది. ఫలితంగా ఓవరాల్ లుక్.. మరింత బోల్డ్, మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.
మహీంద్రా థార్ 5 డోర్ వెనుక భాగంలో కూడా మేకోవర్ వస్తుంది. ఇప్పటికే ఉన్న వాటి స్థానంలో కొత్త ఎల్ఈడీ టెయిల్లైట్లు వస్తాయి. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంటాయి. 18 ఇంచ్ సైజ్‌తో రావొచ్చు.
పొడిగించిన వీల్‌బేస్, అదనపు తలుపులు.. ఈ మహీంద్రా థార్ ఆర్మాడాలో కనిపించే అత్యంత ముఖ్యమైన మార్పులు. ఇవి.. ఈ కారును ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెహికిల్‌గా మారుస్తాయి.
Mahindra Thar Armada 5 door : మహీంద్రా థార్ అర్మాడా ఆధునిక టచ్‌స్క్రీన్ యూనిట్ కోసం పాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్‌ను తొలగించనుందని, ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ నుంచి తీసుకుంటున్నట్టు సమాచారం. మెరుగైన క్యాబిన్ సౌకర్యం కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుదట. స్టీరింగ్ వీల్ కూడా రిఫ్రెష్ పొందుతుంది. స్కార్పియో ఎన్ నుంచి డిజైన్ రావొచ్చు.
కానీ మహీంద్రా ఇక్కడితో ఆగడం లేదు! టాప్-ఎండ్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్ అందించడం ద్వారా ఈ సెగ్మెంట్లో మరో అడుగు ముందుకు ఉండనుంది సంస్థ. ఇది భారతదేశంలో సన్‌రూఫ్ కలిగిన ఏకైక ల్యాడర్ ఫ్రేమ్ ఎస్‌యూవీగా నిలిచిపోతుంది ఈ మహీంద్రా థార్ 5 డోర్.
మహీంద్రా థార్ అర్మాడా 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ యూనిట్ వంటి సుపరిచిత ఆప్షన్స్‌లో కొనసాగించే అవకాశం ఉంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మేన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటాయని సమాచారం. రేర్ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ మహీంద్రా థార్ 5 డోర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు.. లాంచ్ టైమ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.