Best electric scooters in India : మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
02 June 2023, 10:28 IST
- Best electric scooters in India : కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్లో ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!
Best electric scooters in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నానాటికి పెరుగుతోంది. ముఖ్యంగా 2 వీలర్ సెగ్మెంట్లోనూ ఆ జోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు.. కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. మరి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్‌ను ఇక్కడ తెలుసుకోండి.
ఏథెర్ ఎనర్జీ 450ఎక్స్ జెన్ 3..
ఈ థర్డ్ జనరేషన్ ఏథెర్ ఎనర్జీ 450ఎక్స్‌లో ఉన్న పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్.. 8.7 బీహెచ్పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ స్కూటర్ 146కి.మీలు ప్రయాణిస్తుంది. ఆల్- అల్యూమీనియం ఫ్రెమ్ వస్తుండటంతో ఎలక్ట్రిక్ స్కూటర్ బాడీ భద్రత మరింత పెరిగింది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్ వంటి యాక్ససరీలు ఉన్నాయి. స్పీడ్, రేంజ్ మెరుగ్గా ఉంటాయి. మార్కెట్లో ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.37లక్షలుగా ఉంది.
ఏథెర్ ఎనర్జీ 450ఎస్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ మోడల్ విశేషాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బజాజ్ చేతక్..
అలనాటి టూ వీలర్ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగింది బాజాజ్ చేతక్. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. మళ్లీ ఎలక్ట్రిక్ అవతారంలో అడుగుపెట్టి కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇందులో బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 108కి.మీల వరకు ప్రయాణించవచ్చు. ఇందులోని క్విక్ ఛార్జింగ్ ఫీచర్ హైలైట్‌గా నిలుస్తోంది. 25శాతం ఛార్జింగ్‌ను గంటలో అందుకుంటుంది. 5 గంటల్లో ఫుల్‌గా ఛార్జ్ అయిపోతుంది. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.21లక్షలు.
ఇదీ చూడండి:- Honda electric scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే ముందుగా గుర్తొచ్చేది ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రోలు మార్కెట్లో ఉన్నాయి. ఓలా ఎస్1 రేంజ్ 121 కి.మీలుగా ఉండగా.. ఎస్ 1 ప్రో రేంజ్ ఏకంగా 181కి.మీలుగా ఉండటం విశేషం. వీటి టాప్ స్పీడ్ 115కేఎంపీహెచ్. 0-40కేఎంపీహెచ్‌ను 3 సెకన్లలో అందుకోగలవు. ఇక ఓలా ఎస్1 అయితే.. 90కేఎంపీహెచ్‌ను 3.6 సెకన్లలోనే అందుకుంటుంది. ఓలా ఎస్1 ఎక్స్‌షోరూం ధర రూ. 99,999గా ఉంది. ఎస్ 1 ప్రో ఎక్స్‌షోరూం ధర రూ. 1.29లక్షలు.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్..
2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల్లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్.. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్‌గా కొనసాగుతోంది. ఇందులోని డ్యూయెల్ బ్యాటరీ మోడల్ హైలైట్‌గా నిలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140కి.మీ రేంజ్‌ని ఇస్తోంది. డిటాచెబుల్ బ్యాటరీ వంటి ఆప్షన్ లభిస్తుండటం విశేషం. టాప్ స్పీడ్ 45కేఎంపీహెచ్గా ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫచర్స్ వస్తున్నాయి. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 77,490.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ..
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్.. చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇందులో బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. రెండు పెద్ద సైజు హెల్మేట్లు ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎకానమీ మోడ్‌లో 145కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే పర్ఫార్మెన్స్ మోడ్‌లో అయితే దీని రేంజ్ 110 కి.మీలు. అలెక్సా వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ లభిస్తుండటం విశేషం. బ్లూటూత్, మ్యూజిక్ ప్లేబ్యాక్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ వంటివి కూడా వస్తాయి. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.09లక్షలుగా ఉంది.