తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Two-wheelers Price: సబ్సిడీ కట్.. పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచంటే!

Electric two-wheelers Price: సబ్సిడీ కట్.. పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచంటే!

23 May 2023, 13:40 IST

    • Electric two-wheelers Price Hike: ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‍ల ధరలు జూన్ 1వ తేదీ నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫేమ్-2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఇస్తున్న సబ్సిడీని ప్రభుత్వం తగ్గిస్తుంటంతో ధరలు అధికం కానున్నాయి.
Electric Scooters: సబ్సిడీ కట్.. పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచంటే!
Electric Scooters: సబ్సిడీ కట్.. పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచంటే!

Electric Scooters: సబ్సిడీ కట్.. పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచంటే!

Electric two-wheelers Price Hike: ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‍లకు (Electric two-wheelers) ఇచ్చే సబ్సిడీలో కోత విధించింది భారత ప్రభుత్వం. జూన్ 1వ తేదీ నుంచి ఇది వర్తించనుంది. సబ్సిడీ తగ్గడం కారణంగా ఎలక్ట్రిక్ టూవీలర్ల (స్కూటర్లు, బైక్‍‍) ధరలను తయారీ కంపెనీలు పెంచనున్నాయి. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) 2 స్కీమ్ (FAME-2 Scheme) కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు వస్తున్న రాయితీ జూన్ 1 నుంచి తగ్గిపోనుంది. ఇటీవలే భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలు చేయగా.. ఇప్పుడు ఆమోదం లభించింది. దీంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీ తగ్గనుంది. దీంతో జూన్ 1వ తేదీ నుంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధరలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

సబ్సిడీ ఎంత తగ్గుతుందంటే..

Electric two-wheelers Price Hike: సబ్సిడీ కోత ప్రభావం ఓలా (Ola), ఏథెర్ (Ather), టీవీఎస్ (TVS) సహా దాదాపు ఎన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ సంస్థలపై పడుతుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పొందుతున్న ప్రయోజనాల్లో కంపెనీలకు భారీగా కోత పడనుంది. దీంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధర పెంపునకే ఆ సంస్థలు మొగ్గుచూపనున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‍ల ధరలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఫేమ్-2 సబ్సిడీ కింద ఇప్పటి వరకు ఒక్కో కిలో వాట్‍ హవర్ (kWh)కు ప్రభుత్వం రూ.15,000 రాయితీ ఇచ్చేది. దీన్ని జూన్ 1 నుంచి రూ.10,000 తగ్గించనుంది. అర్హత కలిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఎక్స్-ప్యాక్టరీ ధరపై గరిష్ఠంగా ఇప్పటి వరకు 40 శాతం వరకు సబ్సిడీ పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా 15 శాతానికి ప్రభుత్వం తగ్గించేసింది.

Electric two-wheelers Price Hike: ఉదాహరణకు, రూ.1,00,000 ఎక్స్-షోరూమ్ ధర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రస్తుతం ఫేమ్-2 కింద రూ.40,000 సబ్సిడీని పొందుతుంటే.. జూన్ 1 నుంచి ఆ సబ్సిడీ రూ.15,000కు తగ్గిపోతుంది. దీంతో.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వినియోగదారుడు రూ.25,000 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

Electric two-wheelers Price Hike: జూన్ 1వ తేదీ నుంచి అథెర్ 450ఎక్స్ (Ather 450X) ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పెరుగుతాయని ఇప్పటికే ఎథెర్ ఎనర్జీ ప్రకటించింది. మే 31వ తేదీలోగా కొంటే రూ.32,500 వరకు వినియోగదారులు ఆదా చేసుకోవచ్చని పేర్కొంది.

Electric two-wheelers Price Hike: గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడైన 7,79,000 ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఫేమ్-2 కింద సబ్సిడీ ప్రయోజనాలు దక్కాయి. కాగా, ఫేమ్-2 కింద సబ్సిడీని తగ్గించాలని భారీ పరిశ్రమల శాఖ నిర్ణయించటంతో.. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‍ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. పాపులర్ స్కూటర్లపై ధర రూ.30,000 వరకు పెరగొచ్చనే అంచనా ఉంది. కొత్త సబ్సిడీలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థలు ఎలాంటి మార్పులకు పూనుకుంటాయో చూడాలి.