Bank holidays in November 2022 : నవంబర్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
28 October 2022, 10:42 IST
- Bank holidays in November : నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఆ వివరాలు..
నవంబర్ బ్యాంక్ సెలవుల లిస్ట్...
Bank holidays in November : నవంబర్ నెల మొదలవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్‌ను కచ్చితంగా చూసి, గుర్తుపెట్టుకోవాలి. సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక నవంబర్‌లో బ్యాంక్‌లకు 10 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
నవంబర్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
- 2022 నవంబర్ 1:- కన్నడ రాజ్యోత్సవ/కుట్- బెంగళూరు, ఇపాల్లో బ్యాంక్‌లకు సెలవు.
- 2022 నవంబర్ 6:- ఆదివారం
- November bank holidays list : 2022 నవంబర్ 8:- గురునానక్ జయంతి/కార్తీక పౌర్ణమి/ రహస్ పౌర్ణమి/ వంగల పండుగ- అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంపాల్, కొచి, పనాజీ, పట్నా, షిల్లాంగ్, తిరువనంతపురం బ్యాంక్‌లకు సెలవు.
- 2022 నవంబర్ 11:- కనకదాస జయంతి/ వంగ్ల పండుగ:- బెంగళూరు, షిల్లాంగ్‌లోని బ్యాంక్‌లకు సెలవు
- 2022 నవంబర్ 12:- రెండో శనివారం
- 2022 నవంబర్ 13:- ఆదివారం
- 2022 నవంబర్ 20:- ఆదివారం
- 2022 నవంబర్ 23:- సెంగ్ కుట్సనెమ్- షిల్లాంగ్‌లోని బ్యాంక్‌లకు సెలవు
- 2022 నవంబర్ 26:- నాలుగో శనివారం
- 2022 నవంబర్ 27:- ఆదివారం
పండుగ సీజన్ ముగిసింది.. సెలవులు తగ్గాయి!
Bank holidays RBI : దేశంలో ఆగస్టులో మొదలైన పండుగ సీజన్ అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోల్చుకుంటే.. నవంబర్‌లో బ్యాంక్ సెలవులు తగ్గాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంక్‌లకు మొత్తం మీద 21 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక సెప్టెంబర్‌లో బ్యాంక్‌లు 13 రోజులు మూతపడ్డాయి. ఇక ఆగస్టులో కూడా బ్యాంక్‌లకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.
బ్యాంక్‌లకు సంబంధించిన సెలవులను ప్రతి నెల చివర్లో.. ఆర్బీఐ విడుదల చేస్తుంది.