Bank holidays this week : ఈ వారంలో బ్యాంక్‌లకు నాలుగు రోజులు సెలవులు
24 October 2022, 7:02 IST
- Bank holidays this week : వివిధ పండుగల నేపథ్యంలో దేశంలో ఈ వారం బ్యాంక్‌లకు నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..
ఈ వారంలో బ్యాంక్‌లకు నాలుగు రోజులు సెలవు
Bank holidays this week : దీపావళితో పాటు ఇతర పండుగల కారణంగా.. ఈ వారం బ్యాంక్‌లకు నాలుగు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ నాలుగింట్లో ఒకటి నేషనల్ హాలీడే కాగా.. మరో మూడు వివిధ రాష్ట్రాల్లోని సెలవులు.
ఈ వారం బ్యాంక్ సెలవులు..
అక్టోబర్ 24:- ఆర్బీఐ ఇచ్చిన బ్యాంక్ హాలీడే లిస్ట్ ప్రకారం.. దీపావళి నాడు దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు. కానీ గ్యాంగ్‌టక్, ఇంపాల్‌లో మాత్రం బ్యాంక్‌లు పనిచేస్తాయి.
అక్టోబర్ 25:- గోవర్ధన్ పూజ, దీపావళి నేపథ్యంలో గ్యాంగటక్, ఇంపాల్, జైపూర్‌లోని రీజినల్ ఆఫీసులకు సెలవు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంక్‌లు పనిచేస్తాయి.
List of bank holidays : అక్టోబర్ 26:- గోవర్ధన్ పూజ, సంవంత్, భాయ్ బిజ్, భాయ్ దూజ్, బలి ప్రతిపద, లక్ష్మీ పూజ సందర్భంగా అహ్మదాబాద్, బీలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, శిమ్లా, శ్రీనగర్ బ్యాంక్‌లకు సెలవు.
అక్టోబర్ 27:- గ్యాంగ్‌టక్, ఇంపాల్, కాన్పూర్, లక్నో బ్యాంక్‌లకు సెలవు. ఆ రోజు ఛిత్రగుప్త్ జయంతి, నిన్గోల్ చక్కౌబ ఉండటం ఇందుకు కారణం.
ఆర్బీఐ లిస్ట్ ప్రకారం.. రెండో శనివారం, అన్ని ఆదివారాలను కలుపుకుని అక్టోబర్‌లో 21 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. 27వ తేదీ తర్వాత 31న మరో బ్యాంక్ హాలీడే ఉంది.
List of bank holidays in October : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఛత్ పూజ, సూర్య పస్తి దాలా ఛత్ నేపథ్యంలో అహ్మదాబాద్, పట్నా, రాంచీలోని రీజనల్ ఆఫీసులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు చివర్లో వినాయక చవితితో మొదలైన పండుగ సీజన్.. ఆగస్టు 31తో ముగుస్తుంది.