Federal Bank hikes FD rates : ఎఫ్​డీపై వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్​ బ్యాంక్​-federal bank hikes fd rates now offers 8 percent return on a tenor of 700 days ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Federal Bank Hikes Fd Rates, Now Offers 8 Percent Return On A Tenor Of 700 Days

Federal Bank hikes FD rates : ఎఫ్​డీపై వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్​ బ్యాంక్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 23, 2022 02:41 PM IST

Federal Bank hikes FD rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది ఫెడరల్​ బ్యాంక్​. ఆ వివరాలు..

ఎఫ్​డీపై వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్​ బ్యాంక్​
ఎఫ్​డీపై వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్​ బ్యాంక్​

Federal Bank hikes FD rates : ఇటీవలి కాలంలో వివిధ బ్యాంక్​లు.. ఫిక్స్​డ్​ డిపాజిట్ల(ఎఫ్​డీ)పై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫెడరల్​ బ్యాంక్​ కూడా చేరింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువగా ఉండే ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంటుతున్నట్టు ఫెడరల్​ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్​ అధికారిక వెబ్​సైట్​ ప్రకారం.. పెంచిన వడ్డీ రేట్లు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి.

700 డే టెన్యూర్​ కలిగిన ఎఫ్​డీపై వడ్డీ రేట్లను 50 బేసిస్​ పాయింట్లు పెంచింది ఫెడరల్​ బ్యాంక్. మిగిలిన వాటన్నింటిలోనూ ఎలాంటి మార్పులను చేయలేదు. తాజా పెంపు అనంతరం.. 700 డే టెన్యూర్​ కలిగిన ఎఫ్​డీపై వడ్డీ రట్లు.. సాధారణ ప్రజలకు 7.50శాతం, సీనియర్​ సిటిజెన్​కు 8శాతంగా ఉన్నాయి.

ఫెడరల్​ బ్యాంక్ ఎఫ్​డీపై వడ్డీ రేట్లు..

Federal Bank FD rates : ఫెడరల్​ బ్యాంక్​లో.. 7-29 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు 3శాతంగా ఉన్నాయి. 30-45 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై అది 3.25శాతంగా ఉంది. 46-60 రోజుల మధ్య 3.75శాతం, 61-90 రోజుల మధ్య 4శాతం, 91-119 రోజుల మధ్య 4.10శాతం, 120-180 రోజుల మధ్య 4.25శాతంగా ఉన్నాయి వడ్డీ రేట్లు.

ఇక 181-332 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై 4.80శాతం, 33 రోజులకు మెచ్యూర్​ అయితే 5.60శాతం, ఏడాదిలోపు మెచ్యూర్​ అయితే 4.80శాతం, ఏడాది- 20 నెలల మధ్యలో అయితే 5.60శాతం వడ్డీ రేట్లను ఇస్తోంది ఫెడరల్​ బ్యాంక్. 20 నెలలు- 699 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 5.60శాతం వడ్డీని ఇస్తోంది. 700 రోజుల్లో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై గతంలో వడ్డీ రేట్లు 7శాతంగా ఉండగా.. తాజా పెంపుతో అది 7.5శాతానికి పెరిగింది. ఇక 701-749 రోజుల మధ్య మెచ్యూర్​ అయితే 5.75శాతం, 750 రోజులకు మెచ్యూర్​ అయితే 6.50శాతం, 751 రోజులు- మూడేళ్ల కాలానికి 5.75శాతం వడ్డీని ఇస్తోంది.

మూడేళ్ల నుంచి 2221 రోజుల మధ్యలో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీలపై.. ఫెడరల్​ బ్యాంక్​ 6శాతం వడ్డీని ఇస్తోంది. 2222 రోజులు, 2223 అంత కన్నా ఎక్కువ కాలం ఉంటే.. ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు 6.20శాతం, 6శాతంగ ఉన్నాయి.

Federal Bank FD Rates
Federal Bank FD Rates (federalbank.co.in)

ఫెడరల్​ బ్యాంక్​ త్రైమాసిక ఫలితాలు..

Federal bank Q2 results : కొన్ని రోజుల క్రితమే క్యూ2 ఫలితాలను విడుదల చేసింది ఫెడరల్​ బ్యాంక్​. సంస్థ స్టాండలోన్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 703.7కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 460.3కోట్లుగా ఉండేది. అంటే ఏడాదిలో 53శాతం వృద్ధిచెందినట్టు.

WhatsApp channel

సంబంధిత కథనం