Interest rates on Bank FDs: FD చేయాలనుకుంటున్నారా? వీటిపైనా ఓ కన్నేయండి-bank fds these small finance banks offer the highest fd interest rates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bank Fds: These Small Finance Banks Offer The Highest Fd Interest Rates

Interest rates on Bank FDs: FD చేయాలనుకుంటున్నారా? వీటిపైనా ఓ కన్నేయండి

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 05:04 PM IST

Interest rates on Bank FDs: FDs.. ఫిక్స్ డ్ డిపాజిట్లు.. సురక్షితమైన పెట్టబడి సాధనాల్లో ఒకటి. రిస్క్ లేని, క్రమ ఆదాయం కోరుకునే వారు ముందుగా చూసేది ఈ FD ల వైపే.. అయితే, FDలో డబ్బు పెట్టేముందు, ఎవరు అత్యధిక వడ్డీ ఇస్తున్నారో చెక్ చేసుకోవడం మంచిది..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Interest rates on Bank FDs: ఇటీవలి కాలంలో FD ల్లో పెట్టుబడులు పెరిగాయి. గతంలో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా FD ల్లో పెట్టుబడి పెట్టేవారు. కానీ, ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా, తమ డైవర్సిఫైడ్ పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగా కొంత మొత్తాన్ని FD ల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Interest rates on Bank FDs: వడ్డీ ముఖ్యం..

సాధారణంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వివిధ స్థాయిల్లో వడ్డీ రేట్లు ప్రకటిస్తుంటాయి. FD కాల వ్యవధిని పరిగణనలోకి తీసుకుని కూడా వడ్డీ రేట్టలో మార్పులు ఉంటాయి. అయినా, వార్షిక వడ్డీ రేటు 7 శాతానికి మించి ఉండే బ్యాంకులు తక్కువే.

Interest rates on Bank FDs: 7% వడ్డీ రేటు

మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధి తో ఉన్న FD లపై కింద పేర్కొన్న బ్యాంకులు స్థిరమైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 7.5% వార్షిక వడ్డీ రేటును ఇస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.35%, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.20% వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.

Interest rates on Bank FDs: వడ్డీపై వడ్డీ

ఈ బ్యాంకులు cumulative వడ్డీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే, మీ డిపాజిట్ పై లభించే వడ్డీని మళ్లీ అసలు కు కలిపి, ఆ మొత్తానికి వడ్డీ లెక్కిస్తారన్న మాట. సాధారణంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ డిపాజిట్లపై వడ్డీ లెక్కిస్తారు. cumulative విధానంలో మూడు నెలలకు మీకు వచ్చిన వడ్డీని తిరిగి అసలు మొత్తానికి జమ చేస్తారు. మరో మూడు నెలల తరువాత ఈ మొత్తానికి మళ్లీ వడ్డీ గణిస్తారు. ఈ విధానం వల్ల ప్రతీ మూడు నెలలకు మీరు పొందే వడ్డీ మొత్తం పెరుగుతూ ఉంటుంది.

<p>FD లపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు</p>
FD లపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు

Interest rates on Bank FDs: కండిషన్లు చెక్ చేసుకోండి

అయితే, FD లను చేసేముందు కేవలం వడ్డీ రేటునే పరిగణనలోకి తీసుకోకుండా, ఆయా సంస్థల టర్మ్స్ అండ్ కండిషన్స్ ను కూడా పరిశీలించాలి. దగ్గర్లోని ఆ బ్యాంక్ శాఖకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. బ్యాంక్ వెబ్ సైట్ ను చెక్ చేయాలి. అలాగే, ఇతర బ్యాంక్ లు ఇస్తున్న వడ్డీ శాతం వివరాలను సేకరించాలి. పూర్తి సమాచారం తీసుకున్న తరువాతే, విశ్వసనీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలి.

WhatsApp channel