Bank holidays in march 2024 : మార్చ్‌లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు!
26 February 2024, 12:44 IST
- Bank holidays in march 2024 in Telangana : మార్చ్‌లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవుల లభించనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మార్చ్‌లో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే..
List of Bank holidays in March : ఆర్థిక పనుల కోసం బ్యాంక్‌లకు తరచూ వెళుతుంటారా? అయితే ఇది మీకోసమే! 2024 మార్చ్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఆర్బీఐ విడుదల చేసింది. మార్చ్‌లో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూతపడి ఉంటాయి. వీటిల్లో పబ్లిక్ హాలీడేలు, పండుగలు, వీకెండ్స్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. వచ్చే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఇక్కడ చూడండి..
మార్చ్‌లో బ్యాంక్ సెలవుల లిస్ట్..
మార్చ్ 1:- చప్చర్ కౌత్, మిజోరంలోని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 3:- ఆదివారం.
మార్చ్ 8:- మహా శివరాత్రి. దిల్లీ, బిహార్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, బెంగాల్, మిజోరం, అసోం, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, ఇటానగర్, గోవా మినహా ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 9:- రెండో శనివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
Bank holidays in March in Telangana : మార్చ్ 10:- ఆదివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 17:- ఆదివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 22:- బిహార్ దివాస్. బిహార్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 23:- నాలుగో శనివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
2024లో బ్యాంక్ సెలవుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్చ్ 24:- ఆదివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 25:- హోలీ. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బిహార్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లు మినహా, ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 26:- యోసాంగ్ సెకెండ్ డే. ఒడిశా, మణిపూర్, బిహార్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
Bank holidays in March Hyderabad : మార్చ్ 27:- హోలీ. బిహార్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 29:- గుడ్ ఫ్రైడే. త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా ఇతర బ్యాంక్‌లకు సెలవు.
మార్చ్ 31:- ఆదివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
ఈ విధంగా.. 2024 మార్చ్ నెలలో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.
ఇక ఫిబ్రవరిలో బ్యాంక్‌లకు 11 రోజుల పాటు సెలవులు లభించాయి.
ఇవి పనిచేస్తాయి.. కానీ
2024 Bank holidays list : బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలను అందరు వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. మనీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ కూడా చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. కానీ.. కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.