Bank Loan Fraud: సిబ్బంది సహకారంతో యూనియన్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారులు..నిందితుల అరెస్ట్
21 February 2024, 14:06 IST
- Bank Loan Fraud: బ్యాంకు సిబ్బంది సహకారంతో కొందరు పారిశ్రామిక వేత్తలు సంగారెడ్డిలో యూనియన్ బ్యాంకుకు Union Bank రూ.28కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ ఘటనలో ఉద్యోగులు సహా పలువురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
సిబ్బంది నిర్వాకంతో యూనియన్ బ్యాంకుకు రూ.28కోట్ల కుచ్చుటోపీ
Bank Loan Fraud: సిబ్బంది తో కుమ్మక్కై 28 కోట్ల రుణాలు తీసుకొని, బ్యాంకు కు కుచ్చు టోపీ పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బ్యాంకు సిజిఎం సహా పలువురు ఉద్యోగులు, ఆడిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాంకు కి వెళ్లి లక్ష రూపాయల ఋణం కోసం దరఖాస్తు చేస్తుకుంటేనే సవాలక్ష ప్రశ్నలు అడిగే బ్యాంకు అధికారులు, తప్పుడు పత్రాలు ఇచ్చిన వారిని ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే 28 కోట్ల ఋణం మంజూరు చేశారు. వారు తిరిగి బ్యాంకుకు ఋణం చెల్లించక పోవడంతో, బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులు ఋణం తీసుకున్నవారికి ఆ బ్రాంచ్ లో పనిచేస్తున్న బ్యాంకు అధికారులు Bank staff సహకరించారని తేల్చారు.
సులభంగా డబ్బులు సంపాదించాలనుకుని తప్పుడు పత్రాలతో బ్యాంకును బురిడీ కొట్టించారు. దీనికి బ్యంకు సిబ్బంది కూడా సహకరించారుర. సంగారెడ్డి జిల్లాలోని ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్ లో పనిచేస్తున్న ఉద్యోగులతో నిందితులు కుమ్మక్కయ్యారు.
వ్యాపారాల పేరుతో తమకున్న ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపించి, తప్పుడు ధ్రువ పత్రాలను చూపుతూ సుమారు రూ.28 కోట్ల ఋణం తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంకు ప్రస్తుత యూనియన్ బ్యాంకు లో కొందరు వ్యక్తులు 2016 లో అప్పటి మేనేజర్ రూపా ఇతర అధికారులతో కుమ్మక్కై వివిధ కంపెనీల పేరిట తప్పుడు పత్రాల చూపించి రుణాలు తీసుకున్నారు.
రుణాలు తీసుకున్నవారు రెండు సంవత్సరాలపాటు సరిగ్గానే ఈఎంఐలు చెల్లించారు. ఆ తర్వాత మరికొంత ఋణం కావాలని బ్యాంకు అధికారులను కోరగా వారు తిరస్కరించారు. దీంతో ఆ తర్వాత వారు ఈఎంఐలు కట్టడం ఆపేసారు. ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉండడంతో 2021లో బ్యాంకు అధికారులు ఆడిట్ లో రూ. 28 కోట్ల రుణానికి సంబంధించిన పత్రాలు పరిశీలించారు. అవి నకిలీ పత్రాలని అడిట్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో అప్పటి బ్యాంకు మేనేజర్ 2021 లో పోలీసులకు పిర్యాదు చేశాడు.
బ్యాంకు మేనేజర్ తో పాటు, 12 మంది అరెస్ట్....
విచారణ చేసిన పోలీసులు, 2016 లో ఋణం తీసుకున్నప్పుడు ఉన్న బ్యాంకు మేనేజర్ రూప, మిగతా సిబ్బంది కూడా, లోన్ తీసుకున్నవారికి సహకరించారని తేల్చి చెప్పారు. మేనేజర్ రూప తో పాటు, 12 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టగా, వారిని కో విచారణ కోసం రిమాండ్ కు తరలించారు.
శ్రీ బాలాజీ ట్రేడర్స్, వి ఆర్ కన్స్ట్రక్షన్స్, రాజేందర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ వెంకటేశ్వర ఆయిల్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, బెస్ట్ సి మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్, దివ్య అగ్రో ఫుడ్స్ ప్రొడక్ట్స్, విష్ణు సాయి ఫార్మా, ఆర్కే మీడియా ప్రమోషన్స్, యంమర్ ఫార్మా, ఎస్వికే ట్రేడర్స్, రానా ఎంటర్ప్రైజెస్ తో పాటు పలు సంస్థలకు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సంస్థల అన్నింటి పైన కూడా కేసు నమోదు చేసినట్టుఅధికారులు రామచంద్రపురం ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.
నిందితులు రామచంద్రాపురం, అశోక్‌నగర్ ఆంధ్రా బ్యాంకు బ్రాంచిలో రుణం కోసం 2016లో దరఖాస్తు చేశారు. నల్గొండ, కోదాడ ప్రాంతాల్లోని భూమి పత్రాల ఆధారంగా అప్పటి చీఫ్ మేనేజర్ రూప, ఇతర అధికారులు కలిసి 11 మందికి గ్రానైట్, బియ్యం, ఫార్మసీ, ఫుడ్ పరిశ్రమ వంటి రంగాలకు వ్యాపారాల రుణంగా రూ.28 కోట్లు మంజూరుచేశారు.
ఈ ఘటనపై 2021 ఆగస్టు 2న చీఫ్ మేనేజర్ రాజు ఫిర్యాదుచేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి 15 మందిపై కేసు నమోదు చేశారు. చీఫ్ మేనేజర్ రూప, ఛార్టర్డ్ అకౌంటెంట్ వెంకట శ్రీనివాస్, వాల్యూడేటర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారావు, రుణగ్రహీతలు సంజయ్‌కుమార్, శ్రీనివాస్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, బ్రహ్మం, కోటేశ్వరరావు, ప్రశాంత్‌లను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రుణం మంజూరు చేసిన సమయంలో బ్యాంకు అధికారులకు రుణ గ్రహీతలు రూ.1.40 కోట్ల కమీషన్ ఇచ్చారు.