Central Bank of India Recruitment: నిరుద్యోగులకు శుభవార్త; సెంట్రల్ బ్యాంక్ లో 3 వేల ఉద్యోగాల భర్తీ; అర్హత డిగ్రీనే..
23 February 2024, 20:58 IST
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ శాఖల్లో 3 వేల అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 6 వ తేదీ.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీ
Central Bank of India Recruitment 2024: 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మార్చి 6వ తేదీ వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రారంభమైందని, దరఖాస్తు ఫారం సమర్పించడానికి మార్చి 6 వరకు గడువు ఉందన్నారు. సెంట్రల్ బ్యాంకులో అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు www.nats.education.gov.in వెబ్ సైట్ లో అప్రెంటిస్ షిప్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
వేకెన్సీ, ఇతర వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 3000 అప్రెంటిస్ (apprentice jobs) పోస్ట్ లను భర్తీ చేస్తోంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు మార్చి 31, 2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 800 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు రూ. 400 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లిచాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రూ. 600 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఇలా అప్లై చేసుకోండి
- అభ్యర్థులు ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.
- ముందుగా అప్రెంటిస్ షిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్ www.nats.education.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- అందులో హోం పేజీలో కనిపించే Apprenticeship with Central Bank of India లింక్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం, Apply Against Advertised Vacancy లింక్ పై క్లిక్ చేయాలి.
- కొత్తగా ఓపెన్ అయిన పేజీలో Apprenticeship with Central Bank of India లింక్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ ఉన్న Apply బటన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించండి.