తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Simple Dot One : 150కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. సింపుల్​ డాట్​ వన్​ లాంచ్​ డేట్​ ఇదే!

Simple Dot One : 150కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. సింపుల్​ డాట్​ వన్​ లాంచ్​ డేట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu

27 November 2023, 14:30 IST

google News
    • Simple Dot One electric scooter : సింపుల్​ ఎనర్జీ నుంచి మరో ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లాంచ్​కు సిద్ధమైంది. ఆ వివరాలను సంస్థ తాజాగా వెల్లడించింది.
ఇండియాలోకి మరో ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లాంచ్​ డేట్​ ఇదే!
ఇండియాలోకి మరో ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లాంచ్​ డేట్​ ఇదే!

ఇండియాలోకి మరో ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లాంచ్​ డేట్​ ఇదే!

Simple Dot One electric scooter : సింపుల్​ ఎనర్జీ సంస్థ నుంచి సరికొత్త, చౌకైన ఎలక్ట్రిక్​ స్కూటర్​ రాబోతోంది. దీని పేరు సింపుల్​ డాట్​ వన్​. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో.. ఈ మోడల్​, డిసెంబర్​ 15న లాంచ్​కానుంది. బుకింగ్స్​ కూడా అదే రోజున ప్రారంభంకానున్నాయి. ఈ విషయాలని సంస్థ తాజాగా ప్రకటించింది.

సింపుల్​ డాట్​ వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ విశేషాలు..

సింపుల్​ ఎనర్జీ సంస్థకు ఇప్పటికే మార్కెట్​లో రెండు ఈవీలు ఉన్నాయి. వీటిల్లో సింపుల్​ వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఒకటి. ఇక డిసెంబర్​లో లాంచ్​కానున్న సింపుల్​ డాట్​ వన్​.. ఈ సింపుల్​ వన్​కు సబ్​-వేరియంట్​గా ఉండనుంది. ఫలితంగా.. సింపుల్​ వన్​ని రూపొందించిన ఫ్లాట్​ఫామ్​పైనే.. కొత్త వెహికిల్​ని కూడా తయారు చేస్తోంది సంస్థ.

Simple Dot One price : కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండనుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 151 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. మైలేజ్​ పెరిగే విధంగా.. ఈ వెహికల్​ టైర్లను ప్రత్యేకంగా రూపొందించినట్టు సంస్థ స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 30 లీటర్ల అండర్​ సీట్​ స్టోరేజ్​, టచ్​స్క్రీన్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, యాప్​ కనెక్టివిటీ సపోర్ట్​తో పాటు ఇతర ఫీచర్స్​ కూడా ఉండనున్నాయి.

సింపుల్​ డాట్​ వన్​ ధర ఎంత?

ఈ సింపుల్​ డాట్​ వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ .1.45లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో టాక్​ నడుస్తోంది. ఇదే నిజమైతే.. భారతీయులకు మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఆప్షన్​ లభించినట్టు అవుతుందని ఆటోమొబైల్​ మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Simple Dot One price in Hyderabad : ఇక ఈ సింపుల్​ డాట్​ వన్​ మోడల్​ డెలివరీలు 2024 జనవరిలో మొదలవుతాయని తెలుస్తోంది. ఇతర వివరాలపై.. లాంచ్​ డేట్​లోపు ఓ క్లారిటీ వస్తుంది.

ఇండియాలోకి మరో ఈవీ..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై మరో అంతర్జాతీయ సంస్థ కన్నేసింది. తైవాన్​కు చెందిన గొగొరో సంస్థ.. ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేయనుంది. ఈ స్కూటర్​ పేరు గొగొరో క్రాస్​ఓవర్ ఈవీ​! డిసెంబర్​లోనే ఈ ఈవీ లాంచ్​ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఈ గొగొరో క్రాస్​ఓవర్ ఈవీ​ మేన్యుఫ్యాక్చరింగ్​ ప్రాసెస్​ మొదలైందని సమాచారం. తొలుత.. బీ2బీ పార్ట్​నర్స్​కి ఈ వెహికిల్​ని సరఫరా చేయనుంది సంస్థ. 2024 తొలినాళ్లల్లో డెలివరీలు మొదలవ్వొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం