తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Maxi Scooter : హీరో మోటోకార్ప్​ కొత్త అడ్వెంచర్​ స్కూటర్​.. జూమ్​ 160 ఇదిగో!

Hero maxi scooter : హీరో మోటోకార్ప్​ కొత్త అడ్వెంచర్​ స్కూటర్​.. జూమ్​ 160 ఇదిగో!

Sharath Chitturi HT Telugu

05 November 2023, 18:19 IST

    • Hero maxi scooter : హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త స్కూటర్ లాంచ్​కానుంది​. ఈ జూమ్​ 160 అడ్వెంచర్​ స్కూటర్​ విశేషాలివే..
హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త స్కూటర్​.. జూమ్​ 160 ఇదిగో!
హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త స్కూటర్​.. జూమ్​ 160 ఇదిగో!

హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త స్కూటర్​.. జూమ్​ 160 ఇదిగో!

Hero Xoom 160 : హీరో మోటోకార్ప్​ సంస్థ నుంచి సరికొత్త స్కూటర్​ రాబోతోంది. దీని పేరు హీరో జూమ్​ 160 అడ్వెంచర్​ మ్యాక్సీ- స్కూటర్​. త్వరలోనే జరగనున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో ఈ మోడల్​ని ఆవిష్కరించనుంది హీరో మోటోకార్ప్​. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

హీరో కొత్త స్కూటర్​ విశేషాలివే..

హీరో జూమ్​ 160 ఏడీవీకి సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. బ్రాండ్​ న్యూ సెగ్మెంట్​లో ఈ స్కూటర్​ ఉంటుందని తెలుస్తోంది. అడ్వెంచర్​ స్కూటర్స్​ సెగ్మెంట్​లో హోండా, ఏప్రీలియా వాహనాలు ఉన్నాయి. ఇక ఈ సెగ్మెంట్​లోకి ఎంట్రీ కోసం గ్రాండ్​గా ప్లాన్​ చేసింది హీరో సంస్థ. ఈ మోడల్​కు ఇండియాతో పాటు లాటిన్​ అమెరికా దేశాల్లో కూడా మంచి డిమాండ్​ ఉంటుందని సంస్థ భావిస్తోంది.

ఈ హీరో జూమ్​ 160 ఏడీవీని జూమ్​ 110 ఆధారంగా రూపొందించినట్టు కనిపిస్తోంది. కాకపోతే ఇది ప్రీమియంగా, మరింత అడ్వెంచర్​ ఓరియెంటెడ్​గా ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్​లో టాల్​ ఏప్రాన్​, ట్విన్​ హెడ్​ల్యాంప్స్​, టాల్​ విండ్​స్క్రీన్​, భారీ అలాయ్​ వీల్స్​, డ్యూయెల్​ పర్పస్​ టైర్స్​ వంటివి వస్తున్నాయి. కార్నరింగ్​ ల్యాంప్స్​, స్టెప్​-అప్​ సింగిల్​ సీట్​, అప్​స్వెప్ట్​ ఎగ్జాస్ట్​, ఫ్రెంట్​ ఫోక్స్​, డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా దీని సొంతం అవ్వొచ్చు.

Hero Xoom 160 maxi scooter : హీరో జూమ్​ 160 మ్యాక్సీ స్కూటర్​లో 163సీసీ, ఎయిర్​ కూల్డ్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​, 4 వాల్స్​ ఇంజిన్​ ఉంటుందని సమాచారం. సరికొత్త ఎక్స్​ట్రీమ్​ 160ఆర్​ 4వీలో కూడా ఇదే ఇంజిన్​ ఉంటుంది. ఇది 16.6 బీహెచ్​పీ పవర్​ని, 14.6 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఇదీ చూడండి:- New electric bike : అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​..

ఈ స్కూటర్​లో బ్లూటూత్​ కనెక్టివిటీ, కాల్​- ఎస్​ఎంఎస్​ అలర్ట్​, రైడర్​ టెలీమాటిక్స్​తో పాటు ఇతర ఫీచర్స్​ ఉండొచ్చు.

Hero Maxi adventure scooter : లాంచ్​ తర్వాత.. ఈ హీరో జూమ్​ 160 అడ్వెంచర్​ మ్యాక్సీ స్కూటర్​.. ఏప్రీలియా ఎస్​ఆర్​ 160, ఎస్​ఎక్స్​ఆర్​ 160, యమహా ఏరోక్స్​ 155 వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

2024 తొలినాళ్లల్లో ఈ స్కూటర్​ ఇండియాలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. హీరో ప్రీమియా డీలర్​షిప్​షోరూమ్స్​ ద్వారా వీటిని సంస్థ సేల్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోందట!

తదుపరి వ్యాసం