తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Motocorp Sales: ఒక్క నెలలోనే 5 లక్షలకు పైగా బైక్స్ సేల్; హీరో మోటోకార్ప్ రికార్డ్

Hero MotoCorp sales: ఒక్క నెలలోనే 5 లక్షలకు పైగా బైక్స్ సేల్; హీరో మోటోకార్ప్ రికార్డ్

HT Telugu Desk HT Telugu

01 November 2023, 16:55 IST

  • Hero MotoCorp sales: ఒక్క అక్టోబర్ నెలలోనే 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను అమ్మి హీరో మోటో కార్ప్ మరోసారి రికార్డు సృష్టించింది. అక్టోబర్ నెలలో దేశీయంగా హీరో మోటో కార్ప్ మొత్తం 5,59,766 బైక్స్ ను సేల్ చేసింది.

హీరో గ్లామర్ బైక్
హీరో గ్లామర్ బైక్

హీరో గ్లామర్ బైక్

Hero MotoCorp sales: ద్విచక్ర వాహనాలను ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్న సంస్థ హీరో మోటో కార్ప్. ఈ సంస్థ ఈ అక్టోబర్ నెలలోనూ రికార్డు స్థాయిలో టూ వీలర్స్ అమ్మకాలు జరిపింది. గత సంవత్సరం అక్టోబర్ లో ఈ సంస్థ మొత్తం 4,54,582 యూనిట్ల ద్వి చక్ర వాహనాలను అమ్మగా.. ఈ సంవత్సరం అక్టోబర్ లో ఎగుమతులు కూడా కలుపుకుని, మొత్తం 5,74,930 బైక్స్ ను సేల్ చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 26% అధికం.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

రికార్డు సేల్స్

ఈ అక్టోబర్ నెలలో దేశీయంగా హీరో మోటో కార్ప్ మొత్తం 5,59,766 యూనిట్లను అమ్మింది. గత సంవత్సరం అక్టబర్ లో ఈ సంఖ్య 4,42,825. అలాగే, ఈ అక్టోబర్ లో సంస్థ మొత్తం 15,164 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. 2022 అక్టోబర్ లో ఈ ఎగుమతుల సంఖ్య 11,757 మాత్రమే. ఇటీవల హీరో మోటోకార్ప్ హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో ఎక్స్ 440 సేల్స్ ను కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు ఆ మోడల్ బైక్స్ 1000 యూనిట్లను అమ్మగలిగింది.

కరిష్మా ఎక్స్ఎంఆర్

కరిష్మా ఎక్స్ఎంఆర్ బైక్ డెలివరీలను కూడా హీరో మోటో కార్ప్ ప్రారంభించింది. ఈ బైక్ కు ఇప్పటివరకు 13 వేల బుకింగ్స్ పూర్తి అయ్యాయి. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర లాంచ్ సమయంలో రూ. 1,72,900 గా ఉండగా, ఇప్పుడు ఆ ధర ను రూ. 1,79,900 కి పెంచారు.

తదుపరి వ్యాసం