తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs New Electric Scooters : టీవీఎస్​ నుంచి త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ లాంచ్​..!

TVS new electric scooters : టీవీఎస్​ నుంచి త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ లాంచ్​..!

Sharath Chitturi HT Telugu

26 November 2023, 12:50 IST

    • TVS new electric scooters : టీవీఎస్​ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది.
టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్స్​..!
టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్స్​..!

టీవీఎస్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్స్​..!

TVS new electric scooters : టీవీఎస్​ సంస్థ.. తన ఎలక్ట్రిక్​ 2 వీలర్​ పోర్ట్​ఫోలియోను ఎక్స్​ప్యాండ్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. ఇందుకోసం భారీగానే ప్రణాళికలు రచించింది. రానున్న 12 నెలల్లో.. వరుస లాంచ్​కు సన్నద్ధమవుతోంది.ఈ విషయాన్ని సంస్థ డైరక్టర్​, సీఈఓ కేఎన్​ రాధాకృష్ణన్​ మీడియాకు తెలిపారు.

12 నెలల్లో వరుస లాంచ్​లు…!

రానున్న 12 నెలల్లో.. మొత్తం ఎన్ని లాంచ్​లు ఉంటాయన్న విషయాన్ని చెప్పనప్పటికీ.. అన్ని ప్రైజ్​ పాయింట్స్​లోనూ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ని తీసుకొస్తున్నట్టు రాధకృష్ణన్​ వెల్లడించారు.

"12 నెలల్లో.. మా ఈవీ పోర్ట్​ఫోలియో మరింత పెరుగుతుంది. 5 కిలోవాట్​ నుంచి 25 కిలోవాట్​ రేంజ్​లో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఉంటాయి," అని రాధాకృష్ణన్​ పేర్కొన్నారు.

TVS new electric scooter launch : మరోవైపు.. సంస్థకు ప్రస్తుతం ఉన్న మోడల్స్​కు భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో మంచి డిమాండ్​ కనిపిస్తోందన్నారు టీసీఎస్​ సీఈఓ. అందుకే.. ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రొడక్షన్​ కెపాసిటీని నెలకు 25వేల యూనిట్​లకు పెంచినట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో రానున్న నెలల్లో తమ ఈవీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ని సైతం మెరుగుపరుచుకోనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:- Gogoro Crossover EV : ఇండియా​లోకి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లాంచ్​ ఎప్పుడంటే!

"ఇండియన్​ ఈవీ సెగ్మెంట్​లో టీవీఎస్​ సంస్థ మేజర్​ ప్లేయర్​ అవుతుందని ఆశిస్తున్నాను," అని రాధకృష్ణన్​ అభిప్రాయపడ్డారు.

‘ఎక్స్​’ పేరుతో ఓ కొత్త ఈవీని ఇటీవలే లాంచ్​ చేసింది టీవీఎస్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ సేల్స్​.. త్వరలోనే ప్రారంభమవుతాయని సమాచారం.

ఇక ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో కూడా తమ విస్తరణ ప్లాన్స్​ని అమలు చేయనున్నట్టు టీవీఎస్​ సీఈఓ వెల్లడించారు.

TVS new electric scooter price : "రానున్న 2-3 త్రైమాసికాల్లో.. టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​, ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. యూరోప్​లో కూడా ఐక్యూబ్​ని లాంచ్​ చేస్తాము. మా స్ట్రాటజీ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాము," అని టీవీఎస్​ సీఈఓ రాధాకృష్ణన్​ స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం