KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్ వర్సెస్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200- ఏది బెస్ట్?
23 April 2023, 7:11 IST
- 2023 KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్‌కు 2023 వర్షెన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌ను బజాజ్ పల్సర్ ఎన్ఎస్200తో పోల్చి.. రెండింట్లో ఏది కొంటే బెటర్ అన్నది తెలుసుకుందాము..
కేటీఎం 200 డ్యూక్ వర్సెస్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200- ఏది బెస్ట్?
2023 KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్‌కు చెందిన 2023 మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ 199.5సీసీ ఇంజిన్ ఇప్పుడు ఒక ఓబీడీ- 2 కంప్లైంట్. ఈ బైక్.. 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్200కు గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
కేటీఎం 200 డ్యూక్ వర్సెస్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200- లుక్స్..
KTM 200 Duke on road price in Hyderabad : కేటీఎం 200 డ్యూక్‌లో ఆరెంజ్ కలర్డ్ ట్రెల్లిస్ ఫ్రేమ్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ విత్ ఎక్స్టెన్షన్స్, వైడ్ హ్యాండిల్‌బార్, స్ప్లిట్ టైప్ సీట్స్, యాంగ్యులర్ మిర్రర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన హాలోజెన్ హెడ్‌ల్యాంప్ యూనిట్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి లభిస్తాయి. ఈ బైక్ ఎత్తు 822ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 155ఎంఎం. వీల్బస్ 1,367ఎంఎం, కర్బ్ వెయిట్ 159కేజీలు.
మరోవైపు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో పెరీమీటర్ ఫ్రేమ్, స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, యాంగ్యులర్ హాలోజెన్ హెడ్‌ల్యాంప్, క్లిప్- ఆన్ హ్యాండిల్‌బార్, అండర్ బెల్లీ ఎగ్సాస్ట్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి వస్తున్నాయి. ఈ బైక్ ఎత్తు 807ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 168ఎంఎం. వీల్‌బేస్ 1,363ఎంఎం. వెయిట్ 158కేజీలు.
ఇదీ చూడండి:- 2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఈ బైక్‌లు ఎలా ఉన్నాయి! ఏ అంశంలో ఏది బెస్ట్?
కేటీఎం 200 డ్యూక్ వర్సెస్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200- ఇంజిన్..
KTM 200 Duke price : 2023 కేటీఎం 200 డ్యూక్‌లో 199.5 సీసీ, సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.4 హెచ్‌పీ పవర్‌ను, 19.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో 199.5సీసీ, లిక్విడ్ కూల్డ్, డీటీఎస్-ఐ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 24.13 హెచ్‌పీ పవర్‌ను, 18.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Bajaj Pulsar NS200 on road price in Hyderabad : ఈ రెండు బైక్స్‌లోనూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్‌లో.. రెండు వీల్స్‌కి డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా వస్తోంది. సస్పెషన్స్ కోసం ఫ్రెంట్ వీల్కి ఇన్వర్టెడ్ ఫోర్క్స్, రేర్‌లో.. ప్రీలోడ్- అడ్జెస్టెబుల్ మోనో షాక్ యూనిట్ వస్తున్నాయి.
కేటీఎం 200 డ్యూక్ వర్సెస్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200- ధర..
Bajaj Pulsar NS200 features : 2023 కేటీఎం 200 డ్యూక్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.92లక్షలుగా ఉంది. ఇక 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఎక్స్‌షోరూం ధర రూ. 1.4లక్షలుగా ఉంది.