తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Shine Vs Sp 125 : హోండా షైన్​ వర్సెస్​ ఎస్​పీ 125.. ఏది కొంటే బెటర్​?

Honda Shine vs SP 125 : హోండా షైన్​ వర్సెస్​ ఎస్​పీ 125.. ఏది కొంటే బెటర్​?

Sharath Chitturi HT Telugu

07 April 2023, 9:29 IST

google News
    • Honda Shine vs SP 125 : హోండా షైన్​ 125, హోండా ఎస్​పీ 125.. ఈ రెండు బైక్స్​లో బెస్ట్​ ఏది? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు హోండా బైక్స్​లో ఏది బెస్ట్​..?
ఈ రెండు హోండా బైక్స్​లో ఏది బెస్ట్​..?

ఈ రెండు హోండా బైక్స్​లో ఏది బెస్ట్​..?

Honda Shine vs SP 125 : రవాణా కోసం డీసెంట్​ బైక్​ కొనుగోలు చేయాలని చూసే వారికి 125సీసీ సెగ్మెంట్​ మంచి ఆప్షన్​. ఇక ఈ సెగ్మెంట్​లో ఎన్నో బైక్స్​ అందుబాటులో ఉన్నాయి. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా నుంచే ప్రముఖంగా రెండు మోడల్స్​ ఉన్నాయి. అవి.. హోండా షైన్​ 125, హోండా ఎస్​పీ 125. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి.. వీటిల్లో ఏది బెస్ట్​? అన్నది తెలుసుకుందాము..

హోండా షైన్​ వర్సెస్​ హోండా ఎస్​పీ 125- లుక్స్​..

Honda Shine 125 price in Hyderabad : లుక్స్​ పరంగా చూసుకుంటే హోండా షైన్​ కాస్త పాతదిగా కనిపిస్తుంది! డిజైన్​లో గత కొన్నేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోవడం ఇందుకు ఓ కారణం. కలర్​ ఆప్షన్స్​ మాత్రం మారుతూ వచ్చాయి. మరోవైపు.. హోండా ఎస్​పీ 125.. షైన్​కు మాడెర్న్​ లుక్​గా అనిపిస్తుంది. ట్యాంక్​ ష్రౌడ్స్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ స్టైల్స్​ మారాయి.

హోండా షైన్​ వర్సెస్​ హోండా ఎస్​పీ 125- స్పెసిఫికేషన్స్​..

Honda SP 125 price in Hyderabad : రెండు బైక్స్​లోనూ 123.94సీసీ ఇంజిన్​ ఉంటుంది. అయితే.. హోండా షైన్ 7,500 ఆర్​పీఎం వద్ద​ 10.5 బీహెచ్​పీ పవర్​ను, 6,000 ఆర్​పీఎం వద్ద 11 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. మరోవైపు హోండా ఎస్​పీ 125.. 7,500 ఆర్​పీఎం వద్ద 10.72 బీహెచ్​పీ పవర్​ను, 6,000 ఆర్​పీఎం వద్ద 10.9 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఈ రెండు బైక్స్​లోనూ 5 స్పీడ్​ గేర్​బాక్స్​ ఆప్షనే ఉంది.

హోండా షైన్​ వర్సెస్​ హోండా ఎస్​పీ 125- ఫీచర్స్​..

Honda Shine 125 features : ఫీచర్స్​ విషయానికొస్తే.. హోండా షైన్​ చాలా బేసిక్​గా అనిపిస్తుంది. ఎనలాగ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, సీబీఎస్​, ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ స్విచ్​, సైడ్​ స్టాండ్​ కటాఫ్​, సైలెంట్​ స్టార్టర్​ వంటి ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి.

ఇక హోండా ఎస్​పీ 125లో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, సైలెంట్​ స్టార్టర్​, సైడ్​ స్టాండ్​ కటాఫ్​, సీబీఎస్​, ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ బటన్​, డిజిటల్​ మీటర్​ వంటివి లభిస్తున్నాయి.

హోండా షైన్​ వర్సెస్​ హోండా ఎస్​పీ 125- ధర..

Honda SP 125 features : ఈ రెండు బైక్స్​కి కూడా రెండేసి వేరియంట్లు ఉన్నాయి. అవి డ్రమ్​, డిస్క్​. హోండా షైన్​ డ్రమ్​ ఎక్స్​షోరూం ధర రూ. 78,687. షైన్​ డిస్క్​ ఎక్స్​షోరూం ధర రూ. 82,687. ఇక హోండా ఎస్​పీ 125 డ్రమ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 85,131. డిస్క్​ వేరియంట్​ ధర రూ. 89,131గా ఉంది.

తదుపరి వ్యాసం