Honda SP125 launched : హోండా ఎస్పీ125 లాంచ్- పల్సర్ 125కి ధీటుగా..!
2023 Honda SP125 launched : హోండా నుంచి ఓ కొత్త బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని పేరు హోండా ఎస్పీ125. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
2023 Honda SP125 launched : 2023 ఎస్పీ125ని దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఈ హోండా ఎస్పీ125.. రెండు వేరియంట్లలో లభించనుంది. డ్రమ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 85,131. డిస్క్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 89,131. బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పర్ల్ సైరెన్ బ్లూ, ఆల్ న్యూ మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ వంటి 5 రంగుల్లో ఈ హోండా కొత్త బైక్ అందుబాటులో ఉండనుంది.
బజాజ్ పల్సర్ 125కి ధీటుగా..!
Honda SP125 on road price in Hyderabad : హోండా ఎస్పీ125.. ఇప్పుడు ఓబీడీ2 కంప్లైంట్. ఇందులోని 125 సీసీ ఇంజిన్‌లో ఈఎస్పీ, ఫ్యూయెల్ ఇంజెక్షన్, ఏసీజీ స్టార్టర్ మోటార్ వంటివి ఉంటాయి. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ లభించనుంది. ఫ్యూయెల్ ట్యాంక్ బయట ఫ్యూయెల్ పంప్ ఉండటంతో.. మెయిన్టేనెన్స్ మరింత సులభతరమవుతుంది. ఇక ఈ హోండా ఎస్పీ125.. బజాజ్ పల్సర్ 125కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఈ 2023 హోండా ఎస్పీ125లో ఫుల్లీ డిజిటల్ మీటర్ ఉంటుంది. యావరేజ్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ, డిస్టెన్స్ టు ఎంప్టీ, రియల్ టైమ్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ, ఈసీఓ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్.. సర్వీస్ డ్యూ రిమైండర్‌తో పాటు ఇతర వివరాలు కనిపిస్తాయి.
Honda SP125 disc : స్టెబిలిటీ, గ్రిప్‌ను పెంచేందుకు.. ఈ బైక్ రేర్ టైర్ విడ్త్‌ను 100ఎంఎం పెంచింది హోండా సంస్థ. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్ బీమ్, పాసింగ్ స్విఛ్ వంటివి ఈ హోండా కొత్త బైక్‌లో లభిస్తున్నాయి. కాంబీ- బ్రేక్ సిస్టెమ్, రేర్ సస్పెన్షన్, 5 స్టెప్ అడ్జెస్టబులిటీ వంటివి ఆఫర్ చేస్తోంది హోండా.
Honda SP125 price Hyderabad : దేశంలో ఈ ఎస్పీ125కి మంచి డిమాండ్ లభిస్తుందని ఆశిస్తున్నట్టు.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యోగేశ్ మాథుర్ తెలిపారు.
ఇటీవలి కాలంలో వరుస లాంచ్‌లతో దూసుకెళుతోంది దూసుకెళుతోంది హోండా సంస్థ. దేశంలో మార్కెట్ షేరును పెంచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించే విధంగా సరికొత్త మోడల్స్‌ను తీసుకొస్తోంది.
సంబంధిత కథనం