తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Honda Sp 125 Vs Tvs Raider : హోండా ఎస్​పీ125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​.. ది బెస్ట్​ ఏది?

2023 Honda SP 125 vs TVS Raider : హోండా ఎస్​పీ125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​.. ది బెస్ట్​ ఏది?

Sharath Chitturi HT Telugu

02 April 2023, 7:26 IST

google News
    • 2023 Honda SP 125 vs TVS Raider : 2023 హోండా ఎస్​పీ 125, టీవీఎస్​ రైడర్​లో ది బెస్ట్​ ఏది? ఏ బైక్​ వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి.
హోండా ఎస్​పీ125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​.. ది బెస్ట్​ ఏది?
హోండా ఎస్​పీ125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​.. ది బెస్ట్​ ఏది? (HT AUTO)

హోండా ఎస్​పీ125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​.. ది బెస్ట్​ ఏది?

2023 Honda SP 125 vs TVS Raider : 2023 ఎస్​పీ 125 వర్షెన్​ను ఇటీవలే ఇండియాలో లాంచ్​ చేసింది హోండా సంస్థ. ఈ మోడల్​లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ బైక్​.. టీవీఎస్​ రైడర్​కు గట్టిపోటీనిస్తుంది మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చిచూసి.. వాల్యూ ఫర్​ మనీ ఏది? అన్నది తెలుసుకుందాము..

హోండా ఎస్​పీ 125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​- లుక్స్​..

2023 Honda SP 125 price : 2023 హోండా ఎస్​పీ 125లో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ విత్​ ఎక్స్​టెన్షన్స్​, సింగిల్​ పస్​ సీట్​ విత్​ బాడీ కలర్డ్​ పిలియన్​ గ్రాబ్​ రెయిల్​, క్రోమ్డ్​ హీట్​షీల్డ్​తో కూడిన సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి లభిస్తున్నాయి. ఇందులో మొత్తం 5 కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

TVS Raider on road price : ఇక టీవీఎస్​ రైడర్​లో ఆరోహెడ్​ షేప్​ల మిర్రర్స్​, స్ప్లిట్​ స్టైల్​ సీట్స్​, సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, ఆల్​- ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​, బ్లూటూత్​ కనెక్టివిటీతో కూడిన డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, అలాయ్​ రిమ్స్​ లభిస్తున్నాయి.

హోండా ఎస్​పీ 125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​-డైమెన్షన్స్​..

2023 Honda SP 125 launch : హోండా ఎస్​పీ 125 వీల్​బేస్​ 1,25ఎంఎం. బరువు 116కేజీలు. 11.2 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ దీని సొంతం.

టీవీఎస్​ రైడర్​ బరువు 123కేజీలు. వీల్​బేస్​ 1,326ఎంఎం. 10 లీటర్ల్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ దీని సొంతం.

హోండా ఎస్​పీ 125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​- ఇంజిన్​..

2023 Honda SP 125 on road price Hyderabad : 2023 హోండా ఎస్​పీ 125లో 123.9సీసీ, 4 స్ట్రోక్​ ఇంజిన్​ వస్తోంది. ఇది 10.7 హెచ్​పీ పీక్​ పవర్​ను, 10.9 ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఇక టీవీఎస్​ రైడర్​లో 124.8సీసీ, ఎయిర్​- ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 15.3 హెచ్​పీ పవర్​ను, 11.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

TVS Raider on road price Hyderabad : ఈ రెండు బైక్స్​లోనూ 5 స్పీడ్​ గేర్​బాక్స్​ లభిస్తోంది.

హోండా ఎస్​పీ 125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​- సేఫ్టీ..

2023 Honda SP 125 : 2023 హోండా ఎస్​పీ 125 ఫ్రెంట్​ వీల్​కు డిస్క్​/ డ్రమ్​ బ్రేక్​ వస్తుండగా.. రేర్​లో డ్రమ్​ బ్రేక్​ ఇస్తున్నారు. హ్యాండ్లింగ్​ మెరుగుపరిచేందుకు సీబీఎస్​ ఉంది. టీవీఎస్​ రైడర్​లో సింక్రొనైజ్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ ఉంటుంది.

ఈ రెండు బైక్స్​లోనూ టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​ ఉన్నాయి. రేర్​లో హైడ్రాలిక్​ టైప్​ స్ప్రింగ్స్​, గ్యాస్​ ఛార్జ్​డ్​ 5 స్టెప్​ అడ్జెస్టెబుల్​ మోనో షాక్​ అబ్సార్బర్స్​ వస్తున్నాయి.

హోండా ఎస్​పీ 125 వర్సెస్​ టీవీఎస్​ రైడర్​- ధర..

TVS Raider latest news : ఇండియాలో 2023 హోండా ఎస్​పీ 125 ఎక్స్​షోరూం ధర రూ. 85,131- రూ. 89,131గా ఉంది. ఇక టీవీఎస్​ రైడర్​ ఎక్స్​షోరూం ధర రూ. 86,803- రూ. 1లక్ష వరకు ఉంది.

తదుపరి వ్యాసం