Pulsar NS160 vs Apache RTR 160 4V : పల్సర్ ఎన్ఎస్160, అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో ఏది బెస్ట్?
27 March 2023, 13:11 IST
2023 Bajaj Pulsar NS160 vs TVS Apache RTR 160 4V : బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, అపాచీ అర్టీఆర్ 160 4వీలో బెస్ట్ ఏది? ఏది కొనొచ్చు? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ రెండు బైక్స్ ఏది బెస్ట్?
2023 Bajaj Pulsar NS160 vs TVS Apache RTR 160 4V : 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 బైక్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ రెండింటిని పోల్చి.. ఏది బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ- లుక్స్..
2023 Bajaj Pulsar NS160 on road price in Hyderabad : పల్సర్ ఎన్ఎస్160 డిజైన్‌ను బజాజ్ సంస్థ మార్చలేదు. ఇంకా ఇది అగ్రెసివ్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్‌గానే ఉంది. అయితే 2023 ఎన్ఎస్160 మోడల్‌ను ఇబోనీ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లోనూ విక్రయిస్తున్నారు.
మరోవైపు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలోనూ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్ వస్తోంది. పల్సర్‌తో పోల్చుకుంటే మాత్రం.. లుక్స్ అంత అగ్రెసివ్‌గా ఉండవు.
2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ- ఇంజిన్..
బజాజ్ పల్సర్ ఎన్ఎస్160లోని ఇంజిన్ 17.02 బీహెచ్పీ పవర్‌ను 14.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలోని ఇంజిన్ 17.31 బీహెచ్పీ పవర్‌ను, 14.73 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కాగా.. అర్బన్, రెయిన్ మోడ్స్‌లో అపాచీ బైక్ 15.42 బీహెచ్పీ పవర్‌ను, 14.14 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
TVS Apache RTR 160 4V price : ఈ రెండు బైక్స్‌లోనూ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. పైగా రెండిట్లోనూ 5 స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తోంది.
2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ- ఫీచర్స్..
2023 Bajaj Pulsar NS160 price : పల్సర్‌లోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డిస్టెన్స్-టు- ఎంప్టీ రీడౌట్ ఉండటం హైలైట్. దీనితో పాటు ఫ్యూయెల్ ఎకానమీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయెల్ ఎకనామీ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్‌కు హ్యాలోజెన్ యూనిట్స్ వస్తున్నాయి. డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంది.
ఇక టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో ఎల్ఈడీ లైటింగ్, రైడింగ్ మోడ్స్, సింగిల్ ఛానెల్ ఏబీఎస్, గ్లైడ్ థ్రూ టెక్నాలజీ, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫెథర్ టచ్ స్టార్ట్ ఆప్షన్స్ వస్తున్నాయి.
2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ- ధర..
TVS Apache RTR 160 4V on road price in Hyderabad : బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఎక్స్‌షోరూం ధర రూ. 1.35లక్షలుగా ఉంది.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్160 4వీ ఎక్స్‌షోరూం ధర రూ. 1.23లక్షలు- రూ. 1.45లక్షల మధ్యలో ఉంటుంది.