Bajaj Pulsar 220F vs TVS Apache RTR 200 : ఈ రెండు బైక్స్‌లో బెటర్ ఏది?
Bajaj Pulsar 220F vs TVS Apache RTR 200 : బజాజ్ పల్సర్ 220ఎఫ్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 బైక్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ రెండింటిని పోల్చి.. ఏది బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
Bajaj Pulsar 220F vs TVS Apache RTR 200 : టూ-వీలర్ సెగ్మెంట్లో బజాజ్ ఆటో, టీవీఎస్ సంస్థల మధ్య పోటీ ఎక్కువగానే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్‌ను ఇవి లాంచ్ చేస్తూ ఉంటాయి. అయితే.. పాత మోడల్స్‌ని కూడా కొత్తగా లాంచ్ చేస్తోంది బజాజ్ ఆటో సంస్థ. ఇందులో భాగంగానే.. 2023 పల్సర్ 220ఎఫ్ బయటకొచ్చింది. ఇది.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీకి గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200- లుక్స్..
Bajaj Pulsar 220F on road price Hyderabad : బజాజ్ పల్సర్ 220ఎఫ్‌లో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, వర్టికల్ డ్యూయెల్ పాడ్ హెడ్‌లైట్ సెటప్, అప్రైట్ విండ్‌స్క్రీన్, సెమీ- ఫేరింగ్ మౌంటెడ్ మిర్రర్స్, డ్యూయెల్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ యూనిట్స్, అప్స్వెప్ట్ ఎక్సాస్ట్ వంటివి ఉన్నాయి.
ఇక టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీలో స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్- లుకింగ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వైడ్ హ్యాండిల్‌బార్, డబుల్ బారెల్ ఎక్సాస్ట్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి.
ఈ రెండు బైక్స్‌లో 17 ఇంచ్ బ్లాక్డ్ ఔట్ ఆలాయ్ వీల్స్ వస్తున్నాయి.
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200- ఇంజిన్..
TVS Apache RTR 200 price : 2023 బజాజ్ పల్సర్ 220ఎఫ్‌లో 220 సీసీ, డీజీఎస్-ఐ, ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.11 హెచ్‌పీ పవర్‌ను, 18.55 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదొక ఓబీడీ-2 కంప్లైంట్ మోడల్.
Bajaj Pulsar 220F price : టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీలో 197.55సీసీ, సింగిల్ సిలిండర్, 40 వాల్వ్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 హెచ్‌పీ పవర్‌ను, 18.55 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
కాగా.. ఈ రెండు మోడల్స్‌లోనూ 5- స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంది.
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200- సేఫ్టీ ఫీచర్స్..
TVS Apache RTR 200 on road price Hyderabad : సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్‌లోనూ డిస్క్ బ్రేక్స్ (ఫ్రెంట్, రేర్), డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటివి ఉన్నాయి. ఫలితంగా పర్ఫార్మెన్స్ మరింత పెరుగుతుంది. ఈ రెండింట్లోనూ ఫ్రెంట్ సైడ్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉన్నాయి. కాగా.. బజాజ్ పల్సర్ 220ఎఫ్‌లో డ్యూయెల్ నిట్రాక్స్ షాక్ అబ్సార్బర్స్ ఉండగా.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ రేర్‌లో ప్రీ-లోడెడ్ అడ్జెస్టెబుల్ మోనో షాక్ ఉంది.
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వర్సెస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200- ధర..
2023 బజాజ్ పల్సర్ 220ఎఫ్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.37లక్షలు. టీవీఎస్ అపాచీ బైక్ ధర రూ. 1.4లక్షలు.
సంబంధిత కథనం