2022 TVS Apache RTR 160 and 180 Bikes | అపాచీలో రేసు గుర్రాలు వచ్చేశాయి!-2022 apache rtr 160 and apache rtr 180 racer s choice model bikes launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2022 Tvs Apache Rtr 160 And 180 Bikes | అపాచీలో రేసు గుర్రాలు వచ్చేశాయి!

2022 TVS Apache RTR 160 and 180 Bikes | అపాచీలో రేసు గుర్రాలు వచ్చేశాయి!

HT Telugu Desk HT Telugu
Sep 08, 2022 02:55 PM IST

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అపాచీ బైక్ లలో రేసర్ ఛాయిస్ మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 1.17 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మరిన్ని వివరాలు చూడండి.

<p>2022 Apache RTR 160 and Apache RTR 180- Racer's Choice</p>
2022 Apache RTR 160 and Apache RTR 180- Racer's Choice

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు TVS మోటార్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయినటువంటి అపాచీ బైక్‌లో రేసర్ ఛాయిస్ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా 2022 Apache RTR 160 అలాగే Apache RTR 180 లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు బైక్‌లు డిజైన్ పరంగా, పనితీరు పరంగా అనేక అప్‌డేట్లను పొందాయి.

ఇవి రేసర్ మోడల్స్ కాబట్టి మంచి పికప్‌తో దూసుకుపోవటానికి మోటార్‌సైకిల్ బరువును కాస్త తగ్గించారు. ఇందులో Apache RTR160 బైక్ 2 కిలోల బరువు తగ్గింపుతో అదనపు పవర్-టు-వెయిట్ రేషియోని పొందగా, Apache RTR180 బరువును 1 కిలో వరకు తగ్గించారు. కొత్త బైక్‌లలో స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అప్‌డేట్ చేశారు.

ఎక్స్-షోరూమ్ వద్ద TVS Apache RTR160 ధర రూ. 1.17 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా, టాప్- ఎండ్ మోడల్ Apache RTR 180 ధర రూ. 1.31 లక్షల నుంచి ఉన్నాయి. ఈ సరికొత్త మోటార్ సైకిళ్లు డ్రమ్, డిస్క్ , డిస్క్ బిటి అనే మూడు వేరియంట్‌లలో లభిస్తాయి. వాటి ప్రకారంగా ధరల్లో మార్పు ఉంటుంది.

2022 TVS Apache RTR 160 - Apache RTR 180 డిజైన్

2022 TVS Apache RTR 160 బైక్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, T-గ్రే అనే ఐదు విభిన్నమైన పెయింట్ స్కీమ్‌లలో అందిస్తుండగా, మరోవైపు 2022 TVS Apache RTR 180 గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతాయి. స్టైలింగ్ అప్‌డేట్‌లో భాగంగా మోటార్‌సైకిళ్లు కొత్త గ్రాఫిక్‌లతో వచ్చాయి.

ఈ రెండు బైక్‌లలో టెయిల్‌లైట్ సెటప్‌తో పాటు LED హెడ్‌ల్యాంప్‌ను కొత్తగా ఇచ్చారు. ముందు వైపున DRLలతో అప్‌డేట్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌, వెనుకవైపు కాంపాక్ట్ LED టెయిల్ ల్యాంప్‌ను అందించారు.

2022 Apache RTR 160 - Apache RTR 180 స్పెక్స్, ఫీచర్లు

యాంత్రికంగా, 2022 Apache RTR 160 బైక్‌లో 159.7 cc ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. దీనిని 5-స్పీడ్ గేర్ బాక్సుతో జతచేశారు. ఈ ఇంజన్ 8750 rpm వద్ద 15.8 bhp గరిష్ట శక్తిని, అలాగే 7000 rpm వద్ద 13.85 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తిచేస్తుంది.

2022 Apache RTR 180 బైక్‌లో 177.4 cc ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. దీనిని 5-స్పీడ్ గేర్ బాక్సుతో జతచేశారు. ఈ ఇంజన్ 9000 rpm వద్ద 16.8 bhp శక్తిని, అలాగే 7000 rpm వద్ద 15.5 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మిగతా ఫీచర్లను పరిశీలిస్తే, రెండు బైక్‌లలో డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్పర్ క్లచ్ లతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. SmartXonnect టెక్నాలజీతో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్ట్‌ ఫీచర్ కూడా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం